విశాఖలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. గోపాలపట్నం పరిధిలోని ఆర్‌ ఆర్‌ వెంటాపురంలో ఎల్‌జి పాలిమర్స్‌ పరిశ్రమలో ఈ ప్రమాదం చోటు సంభవించింది. గురువారం తెల్లవారుజామున 4 గంటలకు పరిశ్రమ నుంచి విష వాయులు లీక్‌ కావడంతో ముగ్గురు మృతి చెందారు. ఇందులో ఓ చిన్నారి కూడా ఉండగా, ఇద్దరు రసాయన గాలి పీల్చడం వల్ల కళ్లు కనిపించక రోడ్డుపక్కనున్న కాలువలో పడి మృతి చెందారు. వాయువు దాదాపు మూడు కిలోమీటర్ల మేర వ్యాపించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. లీకైన రసాయన గాలి పీల్చడం దాదాపు 200మందికిపైగా తీవ్ర అస్వస్థతకు గురైనట్లు భావిస్తున్నామని కలెక్టర్ పేర్కొన్నారు.

LG Polymers Factory gas leakage

కాగా, ఈ రసాయన గాలి పీల్చడం వల్ల చర్మంపై దద్దుర్లు, కళ్లలో మంటలు, ఇతర శ్వాసకు సంబంధించిన వ్యాధులు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రసాయన గాలి పీల్చడం వల్ల రోడ్డుపై వెళ్తున్నవారు ఎక్కడికక్కడే అస్వస్థత గురై పడిపోయారు. సమాచారం తెలుసుకున్న కలెక్టర్‌, పోలీసులు అప్రమత్తమై అస్వస్థతకు గురైన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరిసర ప్రాంతాల్లో ఉన్నవారిని ఖాళీ చేయిస్తున్నారు. వారందరిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Lg Polymers Factory Gas Leakage

రసాయన గాలి పీల్చడం వల్ల 200కిపైగా తీవ్ర అస్వస్థత

కరోనా వ్యాప్తి వల్ల దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. అయితే మూడో విడత లాక్‌డౌన్‌ లో భాగంగా కేంద్రం పరిశ్రమలకు సడలింపులు ఇచ్చింది. దీంతో పరిశ్రమలు తెరుచుకున్నాయి. గురువారం తెల్లవారుజమున 4 గ్యాస్‌ లీకైనట్లు సమాచారం అందిందని కలెక్టర్‌ వినయ్‌ చంద్‌ తెలిపారు. ఎన్డీఆర్‌ఎఫ్‌, పోలీసు, వైద్య సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నట్లు తెలిపారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *