విశాఖపట్నం నగరంలో జనవరి 1, 2025 నుండి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించనున్నారు. ఈ నిషేధానికి సంబంధించి అధికారులు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు, సిబ్బంది శిక్షణా కార్యక్రమాలు సహా అనేక కార్యక్రమాలను చేపట్టారు. కమిషనర్ సంపత్ కుమార్, మేయర్ హరి కుమారి ఆధ్వర్యంలో ప్లాస్టిక్‌ని బాధ్యతాయుతంగా వినియోగించడం, నిషేధం ప్రాముఖ్యతపై నగర ఉద్యోగులతో ప్రమాణం చేయించారు.
విశాఖపట్నం పోలీసులు నూతన సంవత్సర వేడుకల నిర్వహణ కోసం మార్గదర్శకాలు జారీ చేశారు. డిసెంబర్ 31, జనవరి 1వ తేదీన హోటళ్లు, క్లబ్బులు, పబ్బులు మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. అర్ధరాత్రి ఒంటి గంట వరకూ హోటళ్లు, క్లబ్బులు, పబ్బులలో కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటే ముందస్తు అనుమతి తప్పనిసరి అని తెలిపారు. న్యూ ఇయర్ పార్టీలలో శబ్ద స్థాయిలు 45 డెసిబెల్స్ లేదా దాని కంటే తక్కువగా ఉండాలని, కార్యక్రమ నిర్వహకులు, ఈవెంట్ ప్రదేశంలో ఎలాంటి ఆయుధాలను అనుమతించరాదన్నారు.