వైసీపీకి రాజీనామా చేసిన విశాఖ డెయిరీ ఛైర్మన్, 12 మంది డైరెక్టర్లు

వైసీపీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. విశాఖ డెయిరీ ఛైర్మన్ అడారి ఆనంద్ కుమార్ వైసీపీకి వీడ్కోలు పలికారు.

By Medi Samrat  Published on  20 Dec 2024 1:01 PM GMT
వైసీపీకి రాజీనామా చేసిన విశాఖ డెయిరీ ఛైర్మన్, 12 మంది డైరెక్టర్లు

వైసీపీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. విశాఖ డెయిరీ ఛైర్మన్ అడారి ఆనంద్ కుమార్ వైసీపీకి వీడ్కోలు పలికారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్లే పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఆనంద్ తెలిపారు. ఆనంద్ తో పాటు 12 మంది డెయిరీ డైరెక్టర్లు కూడా వైసీపీకి రాజీనామా చేశారు. వీరిలో వరాహ వెంకట శంకర్రావు, పిల్లా రమా కుమారి, కోళ్ల కాటమయ్య, శీరంరెడ్డి సూర్యనారాయణ, ఆరంగి రమణబాబు, రెడ్డి రామకృష్ణ, దాడి పవన్ కుమార్, పరదేశి గంగాధర్, సుందరపు ఈశ్వర్, చిటికెల రాజకుమారి తదితరులు ఉన్నారు. తమ రాజీనామా లేఖలను వైసీపీ కేంద్ర కార్యాలయానికి పంపించారు.

వైసీపీకి పలువురు నాయకులు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. ప్రాథమిక సభ్యత్వానికి, భీమిలీ నియోజక వర్గం బాధ్యతలకు అవంతి శ్రీనివాస్ రాజీనామా చేశారు. 2019-22 మధ్య కాలంలో వైసీపీ ప్రభుత్వంలో ఆవంతి శ్రీనివాస్ ఏపీ క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేశారు.

Next Story