కింగ్‌ జార్జ్‌ హాస్పిటల్‌కు 'వేదాంత‌' విరాళం

Vedantha donation to King George Hospital. విశాఖపట్నంలో ఆరోగ్య సదుపాయాలు మరింతగా మెరుగుపరిచే లక్ష్యంతో వేదాంత‌

By Medi Samrat  Published on  24 Jun 2022 9:00 AM GMT
కింగ్‌ జార్జ్‌ హాస్పిటల్‌కు వేదాంత‌ విరాళం

విశాఖపట్నంలో ఆరోగ్య సదుపాయాలు మరింతగా మెరుగుపరిచే లక్ష్యంతో వేదాంత‌ వైజాగ్‌ జనరల్‌ కార్గో బెర్త్‌ (వీజీసీబీ) నగరంలోని కింగ్‌ జార్జ్‌ హాస్పిటల్‌కు వైద్య పరికరాలను విరాళంగా అందించింది. కార్డియోలైన్‌ హోల్టర్‌ మానిటర్‌ను హాస్పిటల్‌లోని కార్డియాలజీ డిపార్ట్‌మెంట్‌కు విరాళంగా అందించింది. ఈ మెషీన్‌ ను హాస్పిటల్‌ సూపరిండెంట్‌ డాక్టర్‌ పీ మైథిలికి వీజీసీబీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ సీ సతీష్‌కుమార్‌ అందజేశారు. ఈ వైద్య పరికరాలు రోగులతో పాటుగా వైద్య విద్యార్థులకు సైతం ప్రయోజనం కలిగించనున్నాయని డాక్టర్‌ శ్రీనివాస్‌ అన్నారు. ఈ పరికరాలనందించిన వీజీసీబీకి ధన్యవాదములు తెలిపారు.

ఈ సందర్భంగా వేదాంత –ఐరన్‌ అండ్‌ స్టీల్‌ సెక్టార్‌ సౌవిక్‌ మజుందార్‌ మాట్లాడుతూ '' తామెప్పుడూ స‌మాజం అభివృద్ధి చెందేందుకు తోడ్పడే కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నిస్తుంటాము. సమాజాభివృద్ధిలో నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు కూడా కీలకమని నమ్ముతుంటాం. ఈ వైద్య మౌలికవసతులు వైజాగ్‌, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ప్రయోజనం కలిగించుంద''ని అన్నారు.

కార్డియాలజీ డిపార్ట్‌మెంట్‌ హెడ్‌ డాక్టర్‌ మల్లాది శ్రీనివాస రావు మాట్లాడుతూ ''అత్యంత విలువైన హోల్టర్‌ రికార్డర్‌, ఎనలైజర్‌ను కార్డియాలజీ డిపార్ట్‌మెంట్‌కు అందించిన వీజీసీబీకి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. సాధారణంగా ఈ పరీక్ష చేయడానికి బయట 2–3వేల రూపాయల ఖర్చు అవుతుంది. నిరుపేదలకు ఇది పూర్తి ప్రయోజనం కలిగించనుంది. అలాగే పీజీ విద్యార్థులకు సైతం ఉపయుక్తంగా ఉంటుంది''అని అన్నారు.


Next Story
Share it