భారత రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ విశాఖపట్నం పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ముందుగా షెడ్యూల్ ప్రకారం 20వ తేదీ మధ్యాహ్నం 1.45 గంటలకు చేరుకోవాల్సిన రాష్ట్రపతి సాయంత్రం 5.30 గంటలకు విశాఖపట్నం ఐఎన్‌ఎస్ డేగాలోని నావల్ ఎయిర్ స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రెసిడెన్షియల్ సూట్‌కు వెళ్లి అక్కడే బస చేస్తారు. పర్యటనలో భాగంగా రాష్ట్రపతి 21వ తేదీ ఉదయం నేవల్ డాక్‌యార్డ్‌కు చేరుకుని గౌరవ వందనం స్వీకరించి, ఉదయం 9 గంటల నుంచి 11.45 గంటల వరకు జరిగే ఫ్లీట్ రివ్యూలో పాల్గొంటారు. PFR గ్రూప్‌లో మధ్యాహ్నం 12.15 నుండి ఫోటో సెషన్ ఉంటుంది. తర్వాత మధ్యాహ్న భోజన కార్యక్రమం ఉంటుంది. 22వ తేదీ ఉదయం 10.20 గంటలకు ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళతారు.
కాగా, రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఈ నెల 20వ తేదీ మధ్యాహ్నం 3.10 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుని రాష్ట్రపతికి స్వాగతం పలుకుతారు. అక్కడినుండి సాయంత్రం 5.05 గంటలకు ఐఎన్‌ఎస్ డేగాలోని నావల్ ఎయిర్ స్టేషన్‌కు చేరుకుంటారు గవర్నర్ బిశ్వభూషణ్. 21వ తేదీ ఉదయం మధ్యాహ్నం పీఎఫ్‌ఆర్‌లో రాష్ట్రపతితో కలిసి ఫోటోషూట్‌లో పాల్గొని.. అనంతరం రాష్ట్రపతితో కలిసి లంచ్‌లో పాల్గొంటారు. 22వ తేదీ ఉదయం 10.20 గంటలకు రాష్ట్రపతికి గవర్నర్ వీడ్కోలు పలికి ప్రత్యేక విమానంలో విజయవాడకు తిరుగు ప్రయాణం కానున్నారు.