నిఘా నీడ‌లో విశాఖ‌

Security beefed up in Visakhapatnam amid President Ram Nath Kovind's visit. విశాఖ‌లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టి భద్రతను కట్టుదిట్టం చేశారు.

By Medi Samrat  Published on  20 Feb 2022 7:36 AM GMT
నిఘా నీడ‌లో విశాఖ‌

విశాఖ‌లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టి భద్రతను కట్టుదిట్టం చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, త్రివిధ దళాల ఉన్నతాధికారులు ఆదివారం విశాఖపట్నం రానున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సాయంత్రం 5.30 గంటలకు భువనేశ్వర్‌ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖపట్నం చేరుకుంటారు. ఆయనకు ఆహ్వానం పలికేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సాయంత్రం 4.45 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంటారు. ఐఎన్‌ఎస్ డేగా వద్ద రాష్ట్రపతికి స్వాగతం పలికిన అనంతరం సాయంత్రం 5.55 గంటలకు సీఎం తిరుగు ప్రయాణమవుతారు. రాష్ట్రపతి ఐఎన్‌ఎస్ డేగా నుంచి తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన బసకు వెళ్లి సోమవారం ఉదయం 9.30 గంటలకు ఫ్లీట్ రివ్యూకు హాజరవుతారు.

కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి దేవుసిన్హ చౌహాన్, కేంద్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ సహాయ మంత్రి రూపాలా పురుషోత్తం, కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్, అండమాన్ మరియు నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్ అడ్మిరల్ డీకే జోషి, రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, కేంద్ర కార్యదర్శి రక్షణ శాఖ డా. అజయ్ కుమార్, కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి బి. ఆనంద్, ఎర్త్ అండ్ సైన్స్ యూనియన్ సెక్రటరీ డాక్టర్. ఎం. రవిచంద్రన్, గవర్నర్ సెక్రటరీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పీ సిసోడియా, స్కూల్ ఎడ్యుకేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి.రాజశేఖర్, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు రఘునాథరావు, బి.కృష్ణమోహన్ హాజరవుతారు.


Next Story