అల్లూరి జిల్లాలో ప్ర‌మాదం.. లోయ‌లో ప‌డిన ఆర్టీసీ బ‌స్సు

అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. పాడేరు ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా

By Medi Samrat  Published on  20 Aug 2023 11:05 AM GMT
అల్లూరి జిల్లాలో ప్ర‌మాదం.. లోయ‌లో ప‌డిన ఆర్టీసీ బ‌స్సు

అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. పాడేరు ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి 100 అడుగుల‌ లోయలో పడిపోయింది. మోదమాంబ పాదాలకు మూడు కిమీ దూరంలో ప్రమాదం సంభవించింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులు బ‌స్సులో ఉన్న‌ట్లు తెలుస్తోంది. బస్సు చోడవరం నుంచి పాడేరు వెళుతుం డగా ఈ ప్రమాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు మృతిచెందిన‌ట్లు స‌మాచారం. మ‌రో 30 మందికి గాయాల‌వ‌గా.. 1ప‌లువురి పరిస్థితి విషమంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. చెట్టు కొమ్మను తప్పించబోయిన డ్రైవ‌ర్‌.. బస్సుపై నియంత్ర‌ణ కోల్ఓవ‌డంతో ఒక్కసారిగా అదుపుతప్పి లోయలోకి పడిపోయిన‌ట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని స‌హాయ‌కచ‌ర్య‌లు చేప‌ట్టారు. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Next Story