రూ. 10,000 చెల్లించండి.. తహశీల్దార్‌కు వినియోగదారుల ప్యానెల్ ఆదేశాలు
Pay Rs 10,000; rectify complainant's name in records: Consumer panel to Golugond Tahsildar. హక్కుల రికార్డుల్లో పేరు మార్పులో జరిగిన జాప్యానికి ఫిర్యాదుదారు అయిన మహిళకు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 18 July 2022 1:45 PM GMTవిశాఖపట్నం: హక్కుల రికార్డుల్లో పేరు మార్పులో జరిగిన జాప్యానికి ఫిర్యాదుదారు అయిన మహిళకు నష్టపరిహారంగా రూ.10000, న్యాయపరమైన ఖర్చుగా 5000 చెల్లించాలని విశాఖపట్నంలోని వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్-2 గొలుగొండు తహశీల్దార్ (మండల్ రెవెన్యూ అధికారి)ని ఆదేశించింది. పాకలపాడు గ్రామానికి చెందిన గృహిణి గనివాడ భవాని మాట్లాడుతూ.. తన తండ్రి మేడిశెట్టి నారాయణమూర్తి పాకలపాడు గ్రామం వద్ద 12.76 ఎకరాల స్థలం (పొడి మరియు తడి భూములు) విడిచిపెట్టారని తెలిపారు.
రెవెన్యూ రికార్డుల్లో మూర్తి పేరు మీద ఆస్తి నమోదైంది. భవాని.. ఆమె చెల్లెలు నూకరత్నం ఆస్తికి చట్టబద్ధమైన వారసులు.. అది సమానంగా పంచబడింది (ఒక్కొక్కరికి 6.36 ఎకరాలు). మేడిశెట్టి భవానీకి రెవెన్యూ శాఖ పట్టాదార్ పాస్ బుక్, టైటిల్ డీడ్ జారీ చేసింది.
మేడిశెట్టి భవాని.. గనివాడ సత్య ప్రసాదరావును వివాహం చేసుకున్నారు. తరువాత ఆమె తన ఇంటిపేరు మార్చుకుంది. సంబంధిత పత్రాలతో హక్కుల రికార్డుల్లో తన పేరును గనివాడ భవాని అని సరిచేయడానికి ఆమె మార్చి 2, 2020న గొలుగొండ తహశీల్దార్ అధికారికి దరఖాస్తు చేసింది. కానీ రెవెన్యూ అధికారులు మాత్రం పట్టించుకోలేదు. మళ్లీ,. సెప్టెంబర్ 19, 2020న, ఆమె మీ-సేవ ద్వారా రికార్డుల్లో తన పేరు మార్పు కోసం దరఖాస్తు చేసింది. తన పేరు, భర్త పేరు రుజువుగా డాక్యుమెంట్లతో పాటు రూ.315 కూడా చెల్లించింది.
అయితే ఆధారాలు సమర్పించలేదని పేర్కొంటూ రెవెన్యూ అధికారులు దరఖాస్తును తిరస్కరించారు. ఆమె డిసెంబర్ 1, 2020న, హక్కుల రికార్డులలోని నమోదులను సరిదిద్దడానికి AP ఆన్‌లైన్‌లో మళ్లీ దరఖాస్తు చేసింది. 270 చెల్లించి సంబంధిత పత్రాలను రుజువుగా సమర్పించింది. అయితే ఆధారాలు తమకు అందలేదని అధికారులు మళ్లీ దరఖాస్తును తిరస్కరించారు. మహిళ స్పందన కార్యక్రమం సందర్భంగా జిల్లా కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు ఆమె దరఖాస్తును ప్రాసెస్ చేయలేదు. చివరకు వినియోగదారుల కమిషన్‌లో పిటిషన్ వేసింది.
అధికారుల నిర్లక్ష్యమే కారణమని కమిషన్ అధ్యక్షురాలు జి వెంకటేశ్వరి అన్నారు. అధికారుల నుంచి సమయానుకూల సేవలు అందించడంలో జాప్యం సహించబడదన్నారు. పట్టాదార్ పాస్‌బుక్, టైటిల్ డీడ్, 1బి రిజిస్టర్‌లో ఫిర్యాదుదారుని పేరు గనివాడ భవాని అని సరిచేయాలని తహశీల్దార్‌ను ఆదేశించిన కమిషన్.. ఫిర్యాదుదారుడికి మానసిక వేదనకు రూ.10,000, న్యాయపరమైన ఖర్చులకు రూ.5,000 చెల్లించాలని ఆదేశించింది.