జగన్ రాజకీయ నాయకుడు కాదు.. వ్యాపారి : పవన్ కళ్యాణ్
జగన్ రాజకీయ నాయకుడు కాదు.. వ్యాపారి అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆరోపించారు.
By Medi Samrat Published on 18 Aug 2023 4:37 PM ISTజగన్ రాజకీయ నాయకుడు కాదు.. వ్యాపారి అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ నేరాలకు నిలయంగా మారిందని.. తాడేపల్లిలో నేరాల తీవ్రత పెరిగిందని సంచలన ఆరోపణలు చేశారు. విశాఖలో పవన్ మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున భూదోపిడీ జరుగుతోందన్నారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్, మైనింగ్ వ్యాపారం చేస్తున్నారని.. లాటరైట్ పేరుతో బాక్సైట్ తవ్వుతున్నారని ఆరోపించారు.
విశాఖలో 271 ఎకరాల్లో తవ్వకాలు జరిపి.. కడప సిమెంట్ కర్మాగారానికి తరలిస్తున్నారని.. ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులకు రూ.వేల కోట్లు అక్రమంగా వెళ్తున్నాయని ఆరోపించారు. జగన్ రాజకీయ నాయకుడు కాదు.. వ్యాపారి అని ఆరోపించారు. బ్రిటీష్ హయాం కంటే తీవ్రంగా విభజింజి పాలిస్తున్నారని విమర్శించారు.
విశాఖలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందన్నారు. ఒక బార్ వద్దే మూడు మర్డర్లు జరిగాయి అంటే.. విశాఖ పోలీసు ఇలా ఉందని ఎద్దేవా చేశారు. యువత గంజాయి,డ్రగ్స్ మత్తులో ఉందని విచారం వ్యక్తం చేశారు. జగన్ సర్కార్.. ట్రాఫిక్ ఛలానాల పేరుతో ప్రజలను దోపిడీ చేయిస్తుందని ఆరోపించారు. విశాఖ లో పోలీసింగ్ లేదు.. ఆంధ్రప్రదేశ్ లో లా అండ్ ఆర్డర్ పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. జగన్ దోపిడికి సామాన్యుడు ఎలా బ్రతుకతాడని ప్రశ్నించారు.