చిరంజీవికి హృదయపూర్వక స్వాగతం : ఎంపీ విజయసాయిరెడ్డి

MP Vijayasai Reddy welcomed Chiranjeevi who is settling down in Visakha. విశాఖపట్నంలో వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు.

By Medi Samrat  Published on  9 Jan 2023 10:28 AM GMT
చిరంజీవికి హృదయపూర్వక స్వాగతం : ఎంపీ విజయసాయిరెడ్డి

విశాఖపట్నంలో వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, తాను ఇక్కడే స్థిరపడతానని, విశాఖ వాసుడిని అవుతానని వెల్లడించారు. భీమిలి రోడ్ లో స్థలం కొనుక్కున్నానని, త్వరలోనే ఇల్లు కట్టుకుంటానని తెలిపారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ఏపీ ఎగ్జిక్యూటివ్ రాజధాని విశాఖలో స్థిరపడాలని నిర్ణయించుకున్న మెగాస్టార్ చిరంజీవికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నానని వెల్లడించారు. చిరంజీవి కొత్త చిత్రం వాల్తేరు వీరయ్య ఘనవిజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.

వాల్తేరు వీరయ్య చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకల్లో చిరంజీవి మాట్లాడుతూ.. తాను ఎప్పటి నుంచో వైజాగ్‌లో నివాసం ఉందామని అనుకుంటున్నానని.. ఆ కల త్వరలో నెరవేరనుందని చెప్పారు. భీమిలి బీచ్‌ రోడ్డు వైపు స్థలం కొనుగోలు చేసినట్టు ప్రకటించారు. త్వరలోనే ఇల్లు నిర్మించుకుని విశాఖ వాసి అవుతానని చెప్పారు. విశాఖ వచ్చిన ప్రతిసారి ఒక ఉద్వేగానికి గురవుతానని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. డైరెక్టర్‌ చిత్రం పేరు వాల్తేరు వీరయ్య చెప్పగానే చాలా పాజిటివ్‌ ఎనర్జీ వచ్చిందని, అందుకు కారణంగా వైజాగ్‌పై తనకున్న ప్రేమ అని కూడా చెప్పుకొచ్చారు.Next Story