విశాఖపట్నంలో ఐపీఎల్ మ్యాచ్‌లు.. తేదీలివే..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 18 షెడ్యూల్ వెలువడింది. అయితే విశాఖపట్నం రెండు మ్యాచ్ లకు ఆతిథ్యం ఇవ్వనుందని తాజాగా తేలింది.

By Medi Samrat  Published on  16 Feb 2025 7:54 PM IST
విశాఖపట్నంలో ఐపీఎల్ మ్యాచ్‌లు.. తేదీలివే..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 18 షెడ్యూల్ వెలువడింది. అయితే విశాఖపట్నం రెండు మ్యాచ్ లకు ఆతిథ్యం ఇవ్వనుంది. గతంలో కూడా ఇక్కడ మ్యాచ్ లను నిర్వహించగా.. బీసీసీఐ రాబోయే సీజన్‌ లో కూడా ఐపీఎల్ మ్యాచ్ లు నిర్వహించనుంది. గతేడాది మాదిరిగానే ఢిల్లీ క్యాపిటల్స్‌కు విశాఖపట్నం సెకండ్ హోమ్ గా ఉండనుంది. మార్చి 24, 30 తేదీల్లో వైజాగ్‌లో రెండు ఐపీఎల్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్న‌ట్లు తెలుస్తుంది.

రాబోయే IPL సీజన్‌కు మూడు రెగ్యులర్ కాని కేంద్రాలలో విశాఖపట్నం ఒకటి కాగా గౌహతి, ధర్మశాల మిగిలిన రెండు నగరాలు. అస్సాం రాజధానిని రాజస్థాన్ రాయల్స్ వారి రెండవ హోమ్‌గా ఎంచుకున్నప్పటికీ, అక్కడ రెండు గేమ్‌లను ఆడతారు. ధర్మశాలలో పంజాబ్ కింగ్స్‌ మ్యాచ్ లు ఆడనుంది. పంజాబ్ జట్టు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మూడు మ్యాచ్‌లు ఆడనుంది. రాబోయే సీజన్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ తమ కెప్టెన్‌ను ఇంకా ప్రకటించనప్పటికీ, అక్షర్ పటేల్ ను కెప్టెన్ గా నియమిస్తారనే ఊహాగానాలు ఉన్నాయి. మునుపటి సీజన్లలో రిషబ్ పంత్ కెప్టెన్‌గా ఉన్నాడు, అయితే IPL వేలంలో భారత వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్‌ను లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేయడంతో, DC మేనేజ్‌మెంట్ రిటైన్ చేసిన నలుగురు ఆటగాళ్లలో ఒకరైన అక్షర్‌కు కెప్టెన్సీని ఢిల్లీ మేనేజ్మెంట్ అప్పగించాలని భావిస్తోంది.

Next Story