విశాఖ‌లో భారీ అగ్ని ప్ర‌మాదం

Huge Fire Accident In Vishakapatnam. విశాఖ జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం సంభ‌వించింది. గాజువాక నియోజకవర్గంలోని అగనంపూడి ఏపీఐఐసీ పారిశ్రామిక ప్రాంతంలో.

By Medi Samrat  Published on  28 Jan 2021 1:16 AM GMT
Huge Fire Accident In Vishakapatnam

విశాఖ జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం సంభ‌వించింది. గాజువాక నియోజకవర్గంలోని అగనంపూడి ఏపీఐఐసీ పారిశ్రామిక ప్రాంతంలో బుధవారం అర్ధ‌రాత్రి ఈ అగ్నిప్రమాదం జరిగింది. పామాయిల్‌ వంట నూనెల కంపెనీ అయిన పారామౌంట్ సన్ లియోలో అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిప‌డ్డాయి. అప్ర‌మ‌త్త‌మైన సిబ్బంది అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేశారు.

అర్ధ‌రాత్రి వేళ ఒక్క‌సారీగా భారీ ఎత్తున అగ్నికీలలను ఎగిసిప‌డుతుండ‌టం చూసి ప్రజలు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ప్ర‌మాద తీవ్ర‌త ఎక్కువ‌గా ఉండ‌టంతో పోలీసులు అటువైపుగా ఎవరినీ రానీయడం లేదు.

అయితే అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో కార్మికులు ఎవరూ లేరని సమచారం. దీంతో ఎటువంటి ప్రాణహాని జరగలేదు. కానీ భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఈ కంపెనీలో నూనెను డబ్బాలు, ప్యాకెట్లలోకి నింపుతారు. కాగా, ప్రమాదానికి గల కారణాలను అధికారులు అన్వేషిస్తున్నారు.
Next Story