ఆ హెలికాప్టర్‌ మాదే.. ప్రమాదమేమీ జరగలేదు : నేవీ

Helicopter Flying for long time at Yarada In Visakhapatnam. యారాడ తీరంలో హెలికాప్టర్‌ చక్కర్లు కొట్టిన సంఘటనపై నేవీ అధికారులు స్పందించారు.

By Medi Samrat  Published on  27 Aug 2021 1:33 PM GMT
ఆ హెలికాప్టర్‌ మాదే.. ప్రమాదమేమీ జరగలేదు : నేవీ

విశాఖపట్నం : యారాడ తీరంలో హెలికాప్టర్‌ చక్కర్లు కొట్టిన సంఘటనపై నేవీ అధికారులు స్పందించారు. హెలికాప్టర్‌కు ఎలాంటి ప్రమాదం జరగలేదని వెల్లడించారు. ఏఎల్‌హెచ్‌ హెలికాప్టర్‌లు కొత్తగా మూడు తూర్పు నౌకాదళానికి వచ్చాయని చెప్పారు. పూర్తిగా దేశీయంగా తయారైన హెలికాప్టర్లపై శిక్షణ విన్యాసాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. నేవీ అధీనంలో ఉన్న ప్రాంతంలోనే సురక్షితంగా జరిగాయని వివరించారు. యారాడ డాల్ఫిన్ నోస్ ప్రాంతాల్లో హెలికాప్టర్ చక్కర్లు కొడుతూ ఫోటోలు తీయడం జరిగిందని.. అయితే కొంత‌మంది కూలిపోయిందని.. ప్రమాదం జరిగిందనే వార్తలు సరికాదని, అవన్నీ అవాస్తమని అధికారులు కొట్టిపడేశారు. ఏరియల్‌ సర్వేలో భాగంగా చక్కర్లు కొట్టినట్లు వెల్లడించారు. ప్రస్తుతం హెలికాఫ్టర్ డేగలో సురక్షితంగా ఉందని నేవీ అధికారులు పేర్కొన్నారు.


Next Story