విశాఖ‌లో కంపించిన భూమి.. భ‌యంతో ప‌రుగులు తీసిన ప్ర‌జ‌లు..!

Earthquake in Visakhapatnam on November 14th.ఆదివారం ఉద‌యం విశాఖ న‌గ‌రంలో స్వ‌ల్ప భూప్ర‌కంప‌న‌లు సంభ‌వించాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 Nov 2021 2:35 AM GMT
విశాఖ‌లో కంపించిన భూమి.. భ‌యంతో ప‌రుగులు తీసిన ప్ర‌జ‌లు..!

ఆదివారం ఉద‌యం విశాఖ న‌గ‌రంలో స్వ‌ల్ప భూప్ర‌కంప‌న‌లు సంభ‌వించాయి. ప‌లు చోట్ల భూమి స్వ‌ల్పంగా కంపించింది. దీంతో న‌గ‌ర వాసులు భ‌యాందోళ‌న‌కు గురైయ్యారు. అక్కయ్యపాలెం, బీచ్ రోడ్డు, కంచరపాలెం, మధురానగర్, తాడిచెట్లపాలెం, అడ‌వివ‌రం, గోపాల‌పురం, జ్ఞానాపురం, బంగార‌మ్మ‌మెట్ట ప్రాంతాల్లో భూమి కొన్ని సెక‌న్ల పాటు కంపించింది. ఉద‌యం 7.15 గంట‌ల స‌మ‌యంలో భారీ శ‌బ్దాలు కూడా వినిపించాయని అక్క‌డి స్థానికులు అన్నారు. భూ ప్ర‌కంప‌న‌లు రావ‌డంతో ఆందోళ‌న చెందిన ప్ర‌జ‌లు ఇళ్ల‌లోంచి బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు. ఇది సాధారణ భూప్రకంపనలే అని.. ఆందోళన చెందాల్సిన ప‌నిలేద‌ని కొంద‌రు చెబుతున్నారు. దీనిపై ఇంకా పూర్తి స‌మాచారం అందాల్సి ఉంది.

Next Story