భార‌త్‌-పాక్ మ్యాచ్ ఎఫెక్ట్ : క్రికెట్ బెట్టింగ్ గుట్టురట్టు

Cricket Betting Racket Busted In Visakhapatnam. ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ నేఫ‌థ్యంలో విశాఖలో బెట్టింగ్ జోరుగా సాగుతుంది. న‌గ‌రంలోని

By Medi Samrat  Published on  24 Oct 2021 1:17 PM GMT
భార‌త్‌-పాక్ మ్యాచ్ ఎఫెక్ట్ : క్రికెట్ బెట్టింగ్ గుట్టురట్టు

ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ నేఫ‌థ్యంలో విశాఖలో బెట్టింగ్ జోరుగా సాగుతుంది. న‌గ‌రంలోని మాధవధార లో ఉన్న ఓ అపార్ట్ మెంట్ లో నిర్వహిస్తున్న క్రికెట్ బెట్టింగ్ ను పోలీసులు గుట్టురట్టు చేశారు. ఈ మేర‌కు ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ప్రభాకర్ అనే వ్యక్తిని ఎయిర్ పోర్ట్ జోన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రభాకర్ దగ్గరనుంచి ఒక ల్యాప్ టాప్, 2 మొబైల్ ఫోన్లు, రెండు చెక్ బుక్ లు, 2 ఏటీఎం కార్డులు, 88 వేల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. క్రికెట్ బెట్టింగ్ వెనుక నగరంలో మరికొంతమంది ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు ప్రభాకర్ ఇచ్చిన సమాచారం మేరకు ప్రత్యేక పోలీసు బృందాలు మిగిలిన బుకీలను పట్టుకొనే పనిలో నిమ‌గ్న‌మ‌య్యాయి.


Next Story