సీఎం జగన్ ఎల్లుండి విశాఖపట్నం జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా.. సాగర తీరాన్ని పరిరక్షించేందుకు అమెరికాకు చెందిన స్వచ్చంద సంస్ధ పార్లే ఫర్ ది ఓషన్స్‌తో ఒప్పందం, గ్రాడ్యుయేట్లకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు దిగ్గజ మైక్రోసాఫ్ట్ సంస్ధ శిక్షణ ఇచ్చిన 5 వేల మందికి ధృవపత్రాలను సీఎం జగన్ అందించనున్నారు.
ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 9.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. 10.20 – 11.13 గంటల వరకు ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో ఏపీ ప్రభుత్వం, పార్లే ఫర్ ది ఓషన్స్ మధ్య అవగాహనా ఒప్పందం ఉంటుంది. అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. తర్వాత అక్కడినుంచి బయలుదేరి సిరిపురం ఏయూ కాన్వొకేషన్ హాల్‌కు చేరుకుంటారు. 11.23 – 12.10 గంటల వరకు మైక్రోసాఫ్ట్ సంస్ధ శిక్షణ ఇచ్చిన విద్యార్ధులకు ధృవపత్రాలను అందిస్తారు. అనంతరం విద్యార్ధులతో ముఖాముఖి కార్యక్రమం. అనంతరం సీఎం ప్రసంగం ఉంటుంది. అనంతరం 12.40 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి 1.55 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.