రేపు సీఎం జగన్‌ విశాఖ పర్యటన

CM Jagan Visits Vishakapatnam Tommorrow. సీఎం జగన్ రేపు విశాఖ పర్యటనకు వెళ్ల‌నున్నారు. ఉదయం 9.15 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి

By Medi Samrat
Published on : 27 Jan 2023 4:34 PM IST

రేపు సీఎం జగన్‌ విశాఖ పర్యటన
సీఎం జగన్ రేపు విశాఖ పర్యటనకు వెళ్ల‌నున్నారు. ఉదయం 9.15 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడినుంచి నేరుగా చినముషిడివాడలోని శారదా పీఠానికి ఉదయం 11 గంటలకు చేరుకుని వార్షికోత్సవ కార్యక్రమాలలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి.. అక్కయ్యపాలెం సాగరమాల కన్వెన్షన్‌ హాల్‌కు చేరుకుంటారు. అక్కడ అనకాపల్లి ఎంపీ బి. సత్యవతి కుమారుడు డాక్టర్‌ యశ్వంత్, డాక్టర్‌ లీలా స్రవంతి దంపతులను ఆశీర్వదిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటలకు రుషికొండ ఐటీ పార్క్‌ వద్ద గల విశాఖ ఎంపీ ఎం.వి.వి.సత్యనారాయణ నివాసానికి వెళతారు. ఎంపీ కుమారుడు శరత్‌ చౌదరి, జ్ఞానిత దంపతులకు శుభాకాంక్షలు తెలిపి, ఆశీర్వదిస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 1.55 గంటలకు ఐపీఎస్‌ అధికారి విద్యాసాగర్‌ నాయుడు, భవ్య దంపతులను వారి నివాసంలో ఆశీర్వదిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 4 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.








Next Story