విశాఖ‌లో రోడ్డుప్ర‌మాదం.. బ‌య‌ట‌ప‌డ్డ‌ భారీ గంజాయి రవాణా రాకెట్..

Cannabis of worth Rs. 2 crore seized after a van carrying it met with an accident. విశాఖపట్నంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారీ గంజాయి రవాణా రాకెట్ వెలుగుచూసిన

By Medi Samrat  Published on  6 April 2022 3:40 PM IST
విశాఖ‌లో రోడ్డుప్ర‌మాదం.. బ‌య‌ట‌ప‌డ్డ‌ భారీ గంజాయి రవాణా రాకెట్..

విశాఖపట్నంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారీ గంజాయి రవాణా రాకెట్ వెలుగుచూసిన షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఆనందపురం మండలం నీళ్ల కుండి జంక్షన్ సమీపంలో ఆగి ఉన్న మరో లారీని వ్యాన్ ఢీకొని బోల్తా పడింది. అనూహ్యంగా బోల్తా పడిన వ్యానులో 57 బస్తాల్లో 2280 కిలోల గంజాయి లభ్యమైంది. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. వాహనం నంబర్‌ ప్లేట్‌ తొలగించి డ్రైవర్‌ పరారీలో ఉండడంతో ఇంజిన్‌, ఛాసిస్‌ నంబర్ల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. అసలు నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు కసరత్తు చేస్తున్నారు.

పట్టుబడిన గంజాయి విలువ రూ.2 కోట్లకి పైగా ఉంటుందని అంచనా. గంజాయి వ్యాన్ వివరాల కోసం పోలీసులు రవాణాశాఖ అధికారుల సాయం తీసుకుంటున్నారు. ఏజెన్సీ ముంచంగిపుట్టు మండలానికి చెందిన నానిబాబు పేరుతో వాహనం రిజిస్టర్ అయినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కాగా గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ప్రధాన వ్యక్తుల ఆచూకీ లభించలేదు. డబ్బులకు పనికొచ్చిన‌ వ్యక్తులను అరెస్టు చేశారు. అయితే ఇటీవల గంజాయి అక్ర‌మ ర‌వాణ‌పై జరుగుతున్న దాడుల ద్వారా యువత పెద్దఎత్తున‌ డ్రగ్స్‌కు బానిసలవుతున్నట్లు తేలింది.










Next Story