విశాఖ‌లో అగ్నిపెట్టెల లోడ్‌తో వెలుతున్న లారీ దగ్ధం.. 4 కి.మీ ట్రాఫిక్ జామ్

Burning Lorry going with a load of matches in Visakhapatnam.ప్ర‌మాద‌వ‌శాత్తు ఓ అగ్గిపెట్టెల లారీకి మంట‌లు అంటుకుని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 March 2022 2:56 PM IST
విశాఖ‌లో అగ్నిపెట్టెల లోడ్‌తో వెలుతున్న లారీ దగ్ధం.. 4 కి.మీ ట్రాఫిక్ జామ్

ప్ర‌మాద‌వ‌శాత్తు ఓ అగ్గిపెట్టెల లారీకి మంట‌లు అంటుకుని దగ్థ‌మైంది. ఈ ఘ‌ట‌న విశాఖ ప‌ట్నం జిల్లా పెందుర్తి మండ‌లం అక్కిరెడ్డిపాలెం వ‌ద్ద శుక్ర‌వారం ఉద‌యం చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే.. త‌మిళ‌నాడు నుంచి బీహార్ కు అగ్గిపెట్టెల లోడ్‌తో వెలుతున్న లారీ అక్కిరెడ్డిపాలెం వ‌చ్చే స‌రికి ఎదురుగా వ‌స్తున్న వాహ‌నం తాకుతూ వెళ్లింది. ఈ క్ర‌మంలో జ‌రిగిన రాపిడికి మంట‌లు చెల‌రేగాయి.

క్ష‌ణాల్లో లారీ మొత్తం వ్యాప్తించాయి. అగ్గిపెట్టెల లోడ్ కావ‌డంతో పెద్ద ఎత్తున మంట‌లు చెల‌రేగాయి. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన లారీ డ్రైవ‌ర్‌, క్లీన‌ర్ లారీ నుంచి కింద‌కు దిగి ప్రాణాలు కాపాడుకున్నారు. చూస్తుండానే లారీ ద‌గ్థ‌మైంది. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని మంట‌ల‌ను అదుపులోకి తీసుకువ‌చ్చారు. పెందుర్తి- ఆనందపురం ప్రధాన రహదారిపై ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌డంతో నాలుగు కిలో మీట‌ర్ల మేర వాహ‌నాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్‌ను క్ర‌మ‌బ‌ద్దీక‌రించారు.

Next Story