అరకు ఉత్సవానికి వేళాయే..

ఆంధ్రప్రదేశ్‌లోని అరకు లోయ ప్రకృతి ప్రియులను మంత్రముగ్ధులను చేస్తుంది.

By Medi Samrat  Published on  27 Dec 2024 9:15 PM IST
అరకు ఉత్సవానికి వేళాయే..

ఆంధ్రప్రదేశ్‌లోని అరకు లోయ ప్రకృతి ప్రియులను మంత్రముగ్ధులను చేస్తుంది. అరకుకు టూరిజాన్ని పెంపొందించడానికి ఏపీ ప్రభుత్వం పలు కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంది. అందులో భాగంగా అరకు ఉత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.

'అరకు ఉత్సవ్‌' ను జనవరి 31, 2025 నుంచి నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మూడు రోజుల ఉత్సవాల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు, ఈవెంట్స్, క్రీడలు మరెన్నో నిర్వహించనున్నారు. ఈ ప్రాంతాన్ని ప్రధాన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు 2014లో టీడీపీ ప్రభుత్వం అరకు ఉత్సవ్‌ ను నిర్వహించింది. ఆ తర్వాత ఐదేళ్లపాటు ప్రతి సంవత్సరం ఉత్సవ్‌ను తప్పకుండా నిర్వహించారు. 2019లో వైఎస్‌ఆర్‌సీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఉత్సవ్ ను పక్కన పెట్టారు. టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మరోసారి ఉత్సవ్‌ను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు హాట్ ఎయిర్ బెలూన్, రంగోలి పోటీలు, పలు ఈవెంట్స్ ను నిర్వహించనున్నారు. ధింసా, కోయల గిరిజన నృత్యాలు, పులి వేషాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

Next Story