విశాఖలోని కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళలపై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ దాడి చేశాడని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన గిరిజాలకు వెళుతున్న బస్సులో ఐటీఐ జంక్షన్ వద్ద చోటు చేసుకుంది. ఓ వ్యక్తి యాసిడ్ దాడి చేయడంతో బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలు గట్టిగా కేకలు వేశారు. డ్రైవర్ వెంటనే బస్సును ఆపి, స్థానికుల సాయంతో బాధితులను సమీపంలోని హాస్పిటల్‌కు తరలించారు.
కంచరపాలెం సీఐ చంద్రశేఖర్ వెంటనే ఘటన స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. శుక్రవారం రాత్రి బీఆర్టీఎస్ రహదారిపై ప్రయాణిస్తున్న 28ఎ/జీ ఆర్టీసీ బస్సుపై గుర్తుతెలియని వ్యక్తి ఓ ద్రావణాన్ని విసిరాడనిఎం దీంతో బస్సులో కిటికీ పక్కన కూర్చున్న ముగ్గురు మహిళలపై అది పడిందని, దీంతో వారు కళ్లు మండి వారు కేకలు వేశారని పోలీసులు తెలిపారు. దాడిలో ఉపయోగించినది నిజంగానే యాసిడా లేక మరేదేమైనా పదార్థమా అనే దానిపై పరీక్షలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. బాధితుల ఆరోగ్య పరిస్థితి పట్ల ఇంకా స్పష్టత రాలేదని, ఈ దాడి వెనుక కారణాలు నిందితుల వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ద్రవాన్ని నిర్ధారించడానికి నమూనాని ఎఫ్ఎస్ఎల్కి పంపినట్లు పోలీసులు తెలిపారు. చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.