తన కంటే అందంగా ఉందని గుండు కొట్టించి.. కనుబొమ్మలు కత్తిరించి
By తోట వంశీ కుమార్ Published on 6 Jun 2020 3:38 PM ISTవిశాఖపట్నం జిల్లా అక్కయ్యపాలెం సమీపంలోని నందగిరనగర్ ప్రాంతంలోని చెక్కుడు రాయి భవనం వద్ద గురువారం మృతి చెందిన దివ్య(22) ను హత్యచేసినట్లు పోలీసులు తేల్చారు. ఈ కేసుకు సంబంధించి నలుగురు నిందితులని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు పోలీసులు.
యువతి మృతిని ముందుగా అనుమానాస్పద కేసుగా నమోదు చేసినప్పటికీ.. ఆమె శరీరంపై గాయాలు ఉండడంతో హత్య అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు. ఆమెకు ఆశ్రయం ఇచ్చిన వారే అత్యంత దారుణంగా హత్యచేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. పోలీస్ జాగితాలు దివ్యకు ఆశ్రయం ఇచ్చిన గూటాల వసంత, ఆమె సోదరి చుట్టూ తిరగడం, వారు ఉంటున్న ఇంట్లో పరిస్థితిన పరిశీలించిన పోలీసులకు అనుమానం రావడంతో కూపీ లాగగా పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంకు చెందిన దివ్యకు తల్లిదండ్రులు లేకపోవడంతో పిన్ని వాళింట్లో పెరిగింది. కాగా.. 8 నెలల క్రితం దివ్యను అక్కయ్యపాలెం చెక్కుడు రాయి భవనం సమీపంలో ఉంటున్న వసంత ఇంటికి పంపారు. ఆమె భర్త దుబాయ్‌లో ఉంటున్నాడు. దివ్యతో చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేయించి డబ్బు బాగా సంపాదించింది వసంత. దివ్యను అడ్డం పెట్టుకుని వసంత బాగా డబ్బుసంపాదించింది. పంపకాల విషయంలో ఇద్దరికీ తేడాలొచ్చాయి.
తనకు తగినంత డబ్బులివ్వటంలేదని దివ్య వసంతను ప్రశ్నించింది. అది భరించలేని వసంత, దివ్య తన ఇంటినుంచి వెళ్లిపోతుందని భయపడింది. దివ్య ప్రశ్నించటాన్ని తట్టుకోలేని వసంత, ఆమె వెళ్లిపోతే తన ఆదాయానికి గండి పడుతుందని భావించింది. దీంతో తన సోదరి మరికొందరితో కలిసి దివ్యను హత్య చేయటావికి ప్లాన్ వేసింది. వారంతా దివ్యను ఒక గదిలో బంధించి ఆమెకు గుండు గీయించి, కనుబొమ్మలు కత్తిరించి అందవికారంగా చేశారు. ఐదు రోజులపాటు ఆమెకు అన్నపానీయాలు ఇవ్వకుండా వాతలు పెడుతూ హింసించారు. దీంతో దివ్య శరీరంపై పలుచోట్ల గాయాలయ్యాయి. ఈ హింసను తాళలేక దివ్య బుధవారం రాత్రి కన్నుమూసింది.
అనారోగ్యంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు, స్థానికులకు చెప్పారు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా.. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించగా.. ఆమెది హత్య అని తేలింది. వసంత, ఆమె సోదరిని అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా.. మిగతా ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు.