టీడీపీకి గ‌ట్టి షాక్ : మ‌రో ఎమ్మెల్యే వైసీపీలోకి..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Sep 2020 11:27 AM GMT
టీడీపీకి గ‌ట్టి షాక్ : మ‌రో ఎమ్మెల్యే వైసీపీలోకి..

సీఎం జగన్‍తో టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో వాసుపల్లి గణేష్ తన కుమారులతో కలిసి జగన్‌ను కలిశారు. వాసుపల్లి గణేశ్‌‌.. విశాఖ‌ తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు, విశాఖ సౌత్‌ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. గ‌త కొంత కాలంగా గ‌ణేష్‌ పార్టీ మారతారని ఊహాగానాలు వ‌స్తున్న నేఫ‌థ్యంలో.. వాటికి నేటితో తెర‌ప‌డ‌నుంది.

123

ఎంపీ విజయసాయిరెడ్డి ఆధ్వ‌ర్యంలో సీఎం క్యాంప్ ఆఫీసుకు వెళ్లిన గణేష్.. జగన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వాసుపల్లి కుమారులకు కండువా కప్పిన సీఎం జగన్ సాదరంగా వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ప్రస్తుతం వాసుప‌ల్లి వైసీపీ మద్దతుదారునిగా కొనసాగనున్నట్టు తెలుస్తోంది. అనంతరం మీడియాతో మాట్లాడిన గణేష్.. తన కుమారులు వైసీపీలో చేరడం ఆనందంగా ఉందన్నారు. జ‌గ‌న్‌ను కలిసిన వారిలో కృష్ణాజిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఉన్నారు.

Next Story
Share it