లోకల్ ట్రైన్‌లో సీటు విషయంలో మ‌హిళ‌ల మ‌ధ్య‌ గొడ‌వ‌.. జుట్టు ప‌ట్టుకుని..

Women passengers hit each other. ముంబై లోకల్ ట్రైన్‌లో సీటు విషయంలో జరిగిన వివాదం కాస్తా కొంతమంది మహిళల మధ్య తీవ్ర స్థాయిలో

By Medi Samrat  Published on  7 Oct 2022 6:01 AM GMT
లోకల్ ట్రైన్‌లో సీటు విషయంలో మ‌హిళ‌ల మ‌ధ్య‌ గొడ‌వ‌.. జుట్టు ప‌ట్టుకుని..

ముంబై లోకల్ ట్రైన్‌లో సీటు విషయంలో జరిగిన వివాదం కాస్తా కొంతమంది మహిళల మధ్య తీవ్ర స్థాయిలో గొడవకు కార‌ణ‌మైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. వీడియోలో థానే-పన్వేల్ లోకల్ ట్రైన్‌లోని లేడీస్ కంపార్ట్‌మెంట్‌లో మహిళలు ఒకరి జుట్టు ఒకరు లాగడం చూడవచ్చు.

శారదా ఉగ్లే అనే మహిళా కానిస్టేబుల్ ఇద్దరు మహిళా ప్రయాణికుల మధ్య గొడవను ఆపడానికి ప్రయత్నించింది. అయితే, ఆమె కూడా గాయపడి ఆసుపత్రిలో చేరింది. ANI వార్తా సంస్థ ప్రకారం.. "సీటు విషయంలో వివాదం కారణంగా కొంతమంది మహిళలు ఒకరినొకరు కొట్టుకోవడం ప్రారంభించారు. ఒక మహిళా సిబ్బంది గాయపడ్డారు" అని వాషి రైల్వే స్టేషన్ సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ ఎస్ కటారే తెలిపారు.Next Story
Share it