దొంగతనం చేసింది.. దొరికిపోయింది..!
Woman Steal Pans from Shopping Complex Video Viral. సోషల్ మీడియాలో ఎన్నో అద్భుతమైన వీడియోలు మనకు కనిపిస్తాయి.
By Medi Samrat
సోషల్ మీడియాలో ఎన్నో అద్భుతమైన వీడియోలు మనకు కనిపిస్తాయి. గత కొద్ది రోజులుగా దొంగతనాలకు సంబంధించిన అనేక షాకింగ్ వీడియోలు బయటపడ్డాయి. అది చూసిన తర్వాత యూజర్ల తలలు కూడా తిరుగుతున్నాయి. ఇలాంటి వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. అందులో ఓ మహిళ షాపింగ్ కాంప్లెక్స్‌లో దొంగతనం చేసిన దృశ్యం. ఆ మహిళ చేసిన చోరీ తీరును చూసి అందరూ షాక్ అవుతున్నారు.
వైరల్ వీడియోలో ఓ మహిళ కనిపిస్తోంది. ఆమె షాపింగ్ కాంప్లెక్స్‌లో దొంగతనం చేసి దొరికిపోయింది. సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ వీడియోను వాలెరానిసిమో అనే పేజీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ వీడియోలో ఓ మహిళ జీన్స్ టాప్ వేసుకుని కనిపించింది. షాపింగ్ కాంప్లెక్స్‌లోని సెక్యూరిటీ గార్డు అనుమానాస్పదంగా ఉన్న మహిళను సోదా చేయగా.. ఆమె వద్ద ఒకేసారి వంటకు వినియోగించే ఐదు పాన్‌లు కనిపించాయి. పాన్‌ను బట్టల్లో దాచుకుని దొంగతనం చేసేందుకు ప్రయత్నించిందని సెక్యూరిటీ సిబ్బంది చెబుతున్నారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహిళ దొంగతనం చేసిన శైలిని చూసి.. ఒక నెటిజన్.. బూట్లలో 64 అంగుళాల ప్లాస్మా దాచి ఉండవచ్చు అని కామెంట్ చేశాడు. ఒక స్త్రీ పాన్‌లకు జన్మనివ్వడం నేను ఎప్పుడూ చూడలేదని మరొకరు కామెంట్ చేశారు.