ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జరిగిన వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతూ ఉంది. ఇందులో ఒక పురుషుడు, స్త్రీ ని బైక్ పై తీసుకుని వెళుతూ ఉన్నాడు. భార్యాభర్తలు ఒకరితో ఒకరు వాదించుకుంటూ ద్విచక్ర వాహనం పై వెళుతున్నారు.
ఆ వ్యక్తి బైక్ నడుపుతున్నాడు, వెనుక కూర్చుని ఉన్న స్త్రీ అతనిని చెప్పుతో కొట్టడం ప్రారంభించింది. మొదట, ఆమె అతని కుడి వైపుకు కొట్టింది, తరువాత ఎడమ వైపుకు మార్చుకుంది. అయితే ఆ వ్యక్తి స్పందించలేదు. వెనక్కు తిరగలేదు, ఆమెను ఏమీ అనలేదు, అసాధారణంగా ఏమీ జరగనట్లు డ్రైవింగ్ చేస్తూనే ఉన్నాడు. ఈ వీడియోకు నాలుగు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇంతకూ వారి మధ్య గొడవకు ఏది కారణమో ఎవరూ ధృవీకరించలేకపోయారు.