Viral Video: మద్యం మత్తులో స్కూల్‌కు టీచర్‌.. చెప్పులు విసిరిన విద్యార్థులు

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లోని ఓ ప్రాథమిక పాఠశాలకు చెందిన విద్యార్థుల బృందం మద్యం మత్తులో ఉన్న టీచర్‌పై చెప్పులు విసిరి తరిమికొట్టింది.

By అంజి  Published on  27 March 2024 7:39 AM IST
Viral news, Chhattisgarh, students, drunk teacher

Viral Video: మద్యం మత్తులో స్కూల్‌కు టీచర్‌.. చెప్పులు విసిరిన విద్యార్థులు

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లోని ఓ ప్రాథమిక పాఠశాలకు చెందిన విద్యార్థుల బృందం మద్యం మత్తులో ఉన్న టీచర్‌పై చెప్పులు విసిరి తరిమికొట్టింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ కావడంతో సర్వత్రా దుమారం రేగింది. మద్యం మత్తులో ఉన్న ఉపాధ్యాయుడు పాఠశాలకు వచ్చి బోధించకుండా తన విద్యార్థులను దుర్భాషలాడాడు. అతని ప్రవర్తనతో విసిగిపోయిన విద్యార్థులు అతనిని కొట్టి ప్రతీకారం తీర్చుకున్నారు. దీంతో పాఠశాల ఆవరణ నుండి ఉపాధ్యాయుడి పారిపోయాడు. పరిస్థితి నుండి తప్పించుకోవడానికి తీవ్ర ప్రయత్నంలో, ఉపాధ్యాయుడు తన బైక్‌ను త్వరగా స్టార్ట్ చేసి పాఠశాల నుండి వేగంగా వెళ్లిపోయాడు.

విద్యార్థులు అతనిని వెంబడించడంతో పాటు అతని దిశలో చెప్పులు విసిరారు. ఈ ఘటన గత వారం జరిగినట్లు సమాచారం. విద్యార్థులు-ఉపాధ్యాయుల మధ్య జరిగిన ఈ ఘటనను ఓ ఆగంతకుడు వీడియో తీయగా, అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసినప్పటి నుండి, వీడియో 22కే పైగా వీక్షణలను పొందింది. సదరు ఉపాధ్యాయుడు రోజూ మద్యం మత్తులో పాఠశాలకు వస్తున్నట్లు తెలిసింది. బోధించే బదులు, అతను తరచుగా చాప మీద నిద్రపోతూ కనిపిస్తాడు, తన విద్యార్థులు తమకు బోధించమని చేసిన విజ్ఞప్తిని పట్టించుకోడు. ఈ నిర్లక్ష్యం విద్యార్థులకు ఆగ్రహం తెప్పించి, విద్యార్థులు తమ టీచర్‌పై చెప్పులు విసరడం నాటకీయ ఘర్షణకు దారితీసింది.

Next Story