Video: పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతిపై తుపాకీ పెట్టి మహిళ హల్‌చల్
ఉత్తరప్రదేశ్ హర్దోయ్ జిల్లాలోని పెట్రోల్ బంక్‌లో ఓ మహిళ రెచ్చిపోయింది
By Knakam Karthik
Video: పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతిపై తుపాకీ పెట్టి మహిళ హల్‌చల్
ఉత్తరప్రదేశ్ హర్దోయ్ జిల్లాలోని పెట్రోల్ బంక్‌లో ఓ మహిళ రెచ్చిపోయింది. కారు నుంచి దిగాలని అడిగిన పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతిపై తుపాకీ పెట్టి వార్నింగ్ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే.. హర్‌దోయ్‌కి చెందిన ఓ ఫ్యామిలీ స్థానికంగా ఉండే పెట్రోల్ బంకు దగ్గరకు కారులో వెళ్లింది. ఆ కారు గ్యాస్‌తో నడిచేది అవ్వటంతో.. పెట్రోల్ సిబ్బందిని పిలిచి గ్యాస్ నింపమన్నారు. రజినీష్ కుమార్ వారి దగ్గరకు వచ్చాడు. కారులో ఉన్న వారందరి భద్రతను దృష్టిలో పెట్టుకుని.. కిందకు దిగమని ఎంతో మర్యాదగా చెప్పాడు. కారులో ఉన్న ఎహసాన్ ఖాన్ కిందకు దిగాడు.
రజినీష్ కుమార్‌తో గొడవ పెట్టుకున్నాడు. ఆ గొడవ చిలికి చిలికి గాలి వానలా తయారయ్యింది. ఈ నేపథ్యంలోనే రజినీష్ కుమార్.. ఎహసాన్‌ను కుడి మోచేత్తో తోసేశాడు. దీంతో ఎహసాన్ కూతురు ఆరీబా కోపం కట్టలు తెంచుకుంది. కోపంతో రజినీష్‌ను ముందుకు తోసేసింది. ఆ వెంటనే కారు దగ్గరకు పరిగెత్తింది. అక్కడే ఉన్న జనం గొడవను ఆపడానికి ప్రయత్నించసాగారు. కొద్దిసేపటి తర్వాత ఆరీబా గన్నుతో అక్కడికి వచ్చింది. నేరుగా రజినీష్ దగ్గరకు వెళ్లింది. గన్ను తీసి అతడి గుండె మీద పెట్టింది.
కాగా ఆ మహిళ బెదిరింపులకు పెట్రోల్ పంప్ ఉద్యగి ఏ మాత్రం వెనక్కు తగ్గలేదు. దీంతో ఆరీబా తల్లి కలుగజేసుకుంది. కూతుర్ని పక్కకు లాగింది. కాగా జరిగిన ఘటనపై రజినీష్ ఆరీబా కుటుంబసభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎహసాన్ పేరు మీద ఉన్న తుపాకీని సీజ్ చేశారు.