అహ్మదాబాద్‌లోని ఓ పాఠశాల ఉపాధ్యాయుడు విద్యార్థిని నిర్దాక్షిణ్యంగా కొట్టిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. వత్వాలోని మాధవ్ పబ్లిక్ స్కూల్‌లో గణితం బోధించే అభిషేక్ పటేల్‌ను ఈ విషయంలో సస్పెండ్ చేశారు.
పటేల్ విద్యార్థి చేతిని తిప్పి, అతని జుట్టును లాగి కొట్టాడు. ఈ ఘటన తరగతి గదిలోని CCTV ఫుటేజీ లో రికార్డు అయింది. అతను మైనర్‌ను దాదాపు డజను సార్లు చెంపదెబ్బలు కొట్టి కింద పడేశాడు. వీడియో వైరల్ కావడంతో, జిల్లా విద్యాశాఖ అధికారి పాఠశాల ప్రిన్సిపాల్‌కు నోటీసు జారీ చేసి ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ ఆదేశించారు. పటేల్‌ను వత్వ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.
భారతదేశంలో విద్యార్థులను కొట్టడం చట్టవిరుద్ధం, అయినా కూడా దేశవ్యాప్తంగా పాఠశాలల్లో పిల్లలను కొడుతూ ఉంటారు. 2000లో సుప్రీంకోర్టు అన్ని విద్యా సంస్థల్లో శారీరక దండనను నిషేధించింది.