తమిళనాడులో ఊహించని ఘటన ఒకటి జరిగింది. స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న ఓ విద్యార్థి కరెంట్ షాక్‌కు గురై కిందపడిపోయిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. అరంబాక్కంలో స్కూల్ నుండి ఇంటికి వెలుతున్న సమయంలో రోడ్డుమీద నిలిచిన వర్షపు నీటిలో నడుస్తుండగా కరెంటు తీగ తగిలి ప్రాణాలతో కొట్టుమిట్టాడు. వర్షం నీటిలో కరెంట్ తీగ తెగిపడడంతో బాలుడు విద్యుత్ షాక్ బారిన పడ్డాడు. ఈ ఘటన ఈ నెల 16న జరగగా... శనివారం నాడు వీడియో బయటకు రావడంతో నెట్టింట వైరల్‌గా మారింది.
కరెంట్ షాక్‌తో నీటిలో కొట్టుమిట్టాడుతున్న బాలుడిని చూసి అటుగా వస్తున్న ఓ వ్యక్తి ధైర్యంగా బాలుడిని కాపాడేందుకు ప్రయత్నించాడు. 24 ఏళ్ల కన్నన్ తమిజ్‌సెల్వన్ అనే యువకుడు కజాడెన్ ర్యాన్ (9) అనే మూడో తరగతి చదువుతున్న బాలుడిని రక్షించారు. కరెంట్ షాక్‌కు గురై వర్షపు నీటిలో పడి ఉన్న ర్యాన్‌ను అక్కడి నుంచి బయటకు తీసి, సీపీఆర్ చేశారు. అనంతరం ఆసుపత్రికి తరలించడంతో అతడు బతికాడు.