రష్యాకు చెందిన ఓ మహిళ పాముతో పాముతో ఫోటో దిగాలని చేసిన ప్రయత్నం ఊహించని మలుపు తిరిగింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ష్కోడలేరా అనే మహిళ వీడియోను పోస్టు చేసింది. పాము అకస్మాత్తుగా ఆమె ముక్కుపై దాడి చేసింది.
క్లిప్ ప్రారంభంలో ఆమె పామును పట్టుకుని ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపిస్తుంది. అయితే, పాము క్షణాలలో ఆమె ముఖానికి దగ్గరగా రావడం, ఒక్కసారిగా ఆమె ముక్కుపై కొరకడం చూడొచ్చు. ఆమె టెన్షన్ పడకుండా పామును కింద పెట్టేస్తుంది. కాటు వేసిందనే బాధ ఉన్నప్పటికీ, మోడల్ భయపడకుండా, పాముకి ఎలాంటి హాని చేయలేదు. అదృష్టవశాత్తూ, పాము విషపూరితమైనది కాదు. మహిళ ముక్కుపై చిన్న గాయంతో బయటపడింది. మరొక పోస్ట్‌లో, ఆమె పాము కాటు వల్ల కలిగిన గాయానికి సంబంధించిన చిత్రాన్ని పంచుకుంది.