స్టేడియంలో రాత ప‌రీక్ష‌.. ఇలా ఎప్పుడు చూసి ఉండ‌రు

Police recruitment exam in Pakistan stadium. పాక్‌లో 1,167 పోలీస్ ఉద్యోగాల‌కు రాత ప‌రీక్షను నిర్వ‌హించ‌గా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Jan 2023 9:50 AM IST
స్టేడియంలో రాత ప‌రీక్ష‌.. ఇలా ఎప్పుడు చూసి ఉండ‌రు

ఒక్క సారి ఫోటోను గ‌మ‌నిస్తే స్టేడియం మొత్తం కిక్కిరిసిపోయింది. అక్క‌డ ఏదైన క్రికెట్ లేదంటే మ‌రోదైనా మ్యాచ్ జ‌రుగుతుంద‌ని మీరు భావిస్తున్నారా..? ఖ‌చ్చితంగా కాదండోయ్‌. అక్క‌డ పోలీస్ నియామ‌క ప‌రీక్ష జ‌రుగుతోంది. అవునండి నిజంగా ఇది నిజం. మీరు చ‌ద‌వించి క‌రెక్టే. అదేంటీ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ పరీక్షను ఎక్క‌డైన ఇలా బ‌హిరంగంగా నిర్వ‌హిస్తారా..? ఎగ్జామ్ హాల్స్ లేవా అనేగా మీ సందేహాం. నిజంగా ఇది నిజం. అయితే.. ఇలా ప‌రీక్ష‌ను నిర్వ‌హించింది మ‌న దేశంలో కాదండి. మ‌న పొరుగు దేశం పాకిస్తాన్‌లో.

ఇటీవ‌ల పాక్‌లో 1,167 పోలీస్ ఉద్యోగాల‌కు రాత ప‌రీక్షను నిర్వ‌హించ‌గా ఏకంగా 32 వేల మంది నిరుద్యోగులు ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యారు. అస‌లే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌కు ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌డం త‌ల‌కు మించిన భార‌మే. అందుకునే ఇస్లామాబాద్‌లోని ఓ స్టేడియానికి అందరిని అధికారులు పిలిపించారు. దీంతో అభ్య‌ర్థులంతా పెన్నులు, ప్యాడ్‌లు చేత ప‌ట్టుకుని స్టేడియానికి వ‌చ్చి ఇలా ప‌రీక్ష రాశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.

పాక్‌లో నిరుద్యోగం తారాస్థాయికి చేరింది అని చెప్ప‌డానికి ఇదే నిద‌ర్శ‌నం. పాకిస్థాన్ మొత్తం జ‌నాభాలో 31 శాతం మంది నిరుద్యోగులు ఉన్నారు. నిరుద్యోగుల్లో 51 శాతం మ‌హిళ‌లు, 16 శాతం పురుషులు ప్రొఫెష‌న‌ల్ డిగ్రీలు చేసి ఖాళీగా ఉన్నారు.

Next Story