ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్‌నగర్‌లోని పెట్రోలు పంపు సమీపంలోని ఓ షాపు గోడను చేపలను తీసుకెళ్తున్న మినీ ట్రక్కు ఢీకొట్టడంతో అక్కడ గందరగోళం ఏర్పడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది, బలంగా ఢీకొట్టడంతో ఆ ప్రభావం కారణంగా వాహనం నుండి చేపలు కిందకు పడిపోయాయి. దీంతో స్థానికులు ఆ చేపలను దోచుకోవడానికి పరుగెత్తారు.
నవంబర్ 21 న మోహనాలోని దఫాలిపూర్ పెట్రోల్ పంప్ సమీపంలోని క్రాస్‌రోడ్‌లో ఇద్దరు వ్యక్తులు దుకాణం వెలుపల కుర్చీల్లో కూర్చున్నారు. కొద్దిసేపటి తర్వాత మినీ ట్రక్ అదుపుతప్పి దూసుకు వచ్చింది. అతివేగంతో వారిని దాటుకుని వచ్చి దుకాణం గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదాన్ని పసిగట్టిన ఇద్దరు వ్యక్తులు తమ కుర్చీల నుండి సకాలంలో పరిగెత్తుకుని వెళ్లి తప్పించుకున్నారు.
ఇంతలో బతికి ఉన్న చేపలు ట్రక్కు నుండి కింద పడిపోయాయి. వెంటనే పలువురు స్థానికులు అక్కడికి చేరుకుని చేపలను దోచుకోవడం ప్రారంభించారు. పురుషులు, మహిళలు, పిల్లలు చేతిలో పట్టుకోగలిగినన్ని చేపలు పట్టుకుని పారిపోయారు.