Video : మీ కారుకు సన్ రూఫ్ ఉందా.? ఇలాంటి ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంది..!

కారుకు సన్ రూఫ్ కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు. అయితే ఈ సన్ రూఫ్ ల వలన కొన్ని ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి.

By Medi Samrat  Published on  20 Nov 2024 8:00 PM IST
Video : మీ కారుకు సన్ రూఫ్ ఉందా.? ఇలాంటి ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంది..!

కారుకు సన్ రూఫ్ కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు. అయితే ఈ సన్ రూఫ్ ల వలన కొన్ని ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. వారణాసిలో కోతుల బెడద ఉందని స్థానికులు చాలా కాలంగా చెబుతూ ఉన్నారు. అయితే ఒక కోతి భవనం టెర్రస్ నుండి పార్క్ చేసిన కారు సన్‌రూఫ్‌పై పడింది. అంతే ఆ సన్ రూఫ్ కాస్తా బద్దలైంది. కొద్దిక్షణాలు ఆ కారులో ఉండిపోయిన కోతి, ఆ తర్వాత హ్యాపీగా బయటకు వచ్చేసింది.

విషేశ్వర్‌గంజ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కోతి నేరుగా వ్యాపారవేత్త ముఖేష్ జైస్వాల్‌కు చెందిన కారు సన్‌రూఫ్‌పైకి దిగడం కనిపిస్తుంది. ఆ తాకిడికి అద్దం ఒక్కసారిగా పగిలిపోయింది. 10 సెకన్ల క్లిప్ ఆన్‌లైన్‌లో విస్తృత చర్చకు దారితీసింది, కోతుల వల్ల కలిగే నష్టాలపై చర్చించారు. అలాగే వారణాసి నగరంలో కోతుల బెడద గురించి కూడా ప్రభుత్వానికి తెలుస్తోంది. కోతుల బెడదను పరిష్కరించడానికి సమర్థవంతమైన పరిష్కారాల అవసరాన్ని ఈ సంఘటన తెలియజేస్తోంది.


Next Story