సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి. వీటిలో కొన్ని మన హృదయాలను గెలుచుకుంటే, కొన్నింటిని చూసిన తర్వాత మనల్ని షాక్‌కి గురిచేస్తాయి. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చూసిన ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.
వీడియోలో ఒక వ్యక్తి బైక్‌కు తాడుతో కొండచిలువను కట్టడం చూడవచ్చు. యువకుడు కొండచిలువను తాడుతో కట్టి లాక్కెళ్లుతున్నాడు. ఈ వీడియో ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. చాలా మంది తమ అభిప్రాయాన్ని తెలియజేశారు.
కొండచిలువను ఎలా బలవంతంగా రోడ్డుపైకి లాక్కెళ్లుతున్నాడో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన వీడియోలో చూడవచ్చు. ఆ వ్యక్తి కొండచిలువను తన బైక్‌కు తాడు సహాయంతో కట్టి ఎక్కడికో ఈడ్చుకెళ్తున్నాడు. ఈ ఘటన మొత్తాన్ని వెనుక నుంచి కారులో వస్తున్న ఎవరో వీడియో తీసి షేర్ చేశారు.
ఈ వీడియోను చూసి చాలా మంది భయపడ్డారు, మరికొందరు జంతువుల పట్ల క్రూరత్వానికి పాల్పడ్డాడని సదరు వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు.. ఇలాంటి చర్యలను ఎవరైనా అనుమతిస్తారా అని ప్రశ్నించారు. కొంతమంది ఇది జంతువుల హక్కులను ప్రత్యక్షంగా ఉల్లంఘించడమే అని రాశారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.