క్ష‌ణంలో త‌మ్ముడి ప్రాణాన్ని కాపాడిన‌ అన్న‌.. వీడియో వైర‌ల్‌..

Kerala boy falls from terrace while cleaning it, elder brother catches him. కేరళలో ఓ సంఘటన ఒక్కసారిగా అందరినీ టెన్షన్ పెట్టింది.

By Medi Samrat  Published on  3 Aug 2022 8:00 PM IST
క్ష‌ణంలో త‌మ్ముడి ప్రాణాన్ని కాపాడిన‌ అన్న‌.. వీడియో వైర‌ల్‌..

కేరళలో ఓ సంఘటన ఒక్కసారిగా అందరినీ టెన్షన్ పెట్టింది. ఒక బాలుడు తన టెర్రస్‌ను శుభ్రం చేస్తుండగా పై నుండి పడిపోయాడు. అయితే కింద ఉన్న ఆ బాలుడి అన్న క్యాచ్ పట్టుకున్నాడు. ఈ దృశ్యాలు CCTVలో రికార్డ్ చేయబడ్డాయి. 2 లక్షలకు పైగా వ్యూస్ వ‌చ్చాయి.. నెటిజన్ల నుండి వచ్చిన స్పందన ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది.

ఈ ఘటన కేరళలోని మలప్పురంలో చోటుచేసుకుంది. టెర్రస్‌ను శుభ్రం చేస్తుండగా అకస్మాత్తుగా కిందపడిపోబోయాడు.. ఆ బాలుడు పెద్ద ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నాడు. అదృష్టవశాత్తూ కింద ఉన్న అన్నయ్య.. తమ్ముడు నేలను తాకకముందే పట్టుకున్నాడు. అన్న వెంటనే రియాక్ట్ అవ్వడం బాలుడికి ఏమీ అవ్వకుండా రక్షించడానికి కారణమైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






Next Story