కన్నడ మాట్లాడను, హిందీలోనే మాట్లాడతా అయితే ఏంటి?..బ్యాంక్ మేనేజర్ రచ్చ

కర్ణాటకలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ కస్టమర్‌తో వాగ్వాదానికి దిగినట్లు కనిపిస్తోన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

By Knakam Karthik
Published on : 21 May 2025 4:07 PM IST

National News, Viral Video, Karnataka, SBI, Cm Siddaramaiah

కన్నడ మాట్లాడను, హిందీలోనే మాట్లాడతా అయితే ఏంటి?..బ్యాంక్ మేనేజర్ రచ్చ

కర్ణాటకలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ కస్టమర్‌తో వాగ్వాదానికి దిగినట్లు కనిపిస్తోన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో తాను కన్నడ మాట్లాడను అంటూ ఆ మేనేజర్ రచ్చ చేయడంతో ఆమెపై విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటన అనేకల్ తాలూకాలోని సూర్యనగర్ ఎస్బీఐ బ్రాంచులో జరిగింది. బ్యాంకుకు వచ్చిన కస్టమర్ కన్నడ మాట్లాడాలని కోరగా కన్నడలో మాట్లాడాలని ఏమైనా రూల్ ఉందా నేను కన్నడలో మాట్లాడను హిందీలోనే మాట్లాడుతా అని చెప్పింది. కాగా ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

తాజాగా కర్నాటక సీఎం సిద్ధరామ‌య్య ఈ విషయంపై స్పందించారు. బ్యాంకు మేనేజ‌ర్ పౌరుల‌తో ప్ర‌వ‌ర్తించిన తీరు స‌రికాద‌ని అన్నారు. స్థానిక భాష‌ను బ్యాంకు ఉద్యోగులు అంతా గౌర‌వించాల‌ని క‌స్ట‌మ‌ర్ల‌ను గౌర‌విస్తూనే స్థానిక భాష‌లో మాట్లాడే ప్ర‌య‌త్నం చేయాల‌ని అన్నారు. సూర్య‌న‌గ‌ర్ లో క‌న్న‌డ మాట్లాడేందుకు నిరాక‌రించిన మేనేజ‌ర్ ను స‌స్పెండ్ చేశార‌ని చెప్పారు. ఇంత‌టితో ఈ స‌మ‌స్య స‌ద్దుమ‌ణిగింద‌ని తాము భావిస్తున్నామ‌న్నారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా అధికారులు చూసుకోవాల‌న్నారు. భాషా వివాదం కొన‌సాగుతున్న వేళ ఇలాంటివి జరిగితే ఉద్రిక్త‌త‌లు పెరిగే అవ‌కాశం ఉంద‌న్నారు.

Next Story