యువకుడిపై నుంచి వెళ్లిన రైలు.. లక్కీగా బతికి బట్ట కట్టాడు.. వీడియో

Goods train passed over man lying on track in Bihar. రైలు పట్టాలు దాటే క్రమంలో ఓ వ్యక్తి తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. భాగల్‌పూర్‌కు చెందిన

By అంజి
Published on : 11 Nov 2022 3:43 PM IST

యువకుడిపై నుంచి వెళ్లిన రైలు.. లక్కీగా బతికి బట్ట కట్టాడు.. వీడియో

రైలు పట్టాలు దాటే క్రమంలో ఓ వ్యక్తి తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. భాగల్‌పూర్‌కు చెందిన ఓ వ్యక్తి పట్టాలు దాటే క్రమంలో.. స్టేషన్‌లో ఆగి ఉన్న గూడ్స్‌ రైలు కింది నుంచి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ వ్యక్తి కిందకు వెళ్లగానే ఒక్కసారిగా రైలు కదిలింది. దీంతో వెంటనే అప్రమత్తమైన యువకుడు.. చాలా చాకచక్యంగా వ్యవహరించాడు. రైలు వెళ్లి పోయే వరకు ట్రాక్‌పై పడుకున్నాడు. ఈ ఘటన బీహార్‌ రాష్ట్రంలోని కహల్‌గావ్‌ రైల్వే స్టేషన్‌లో జరిగింది. రైలు వెళ్లిన తర్వాత లేచి వచ్చాడు.

దీంతో అక్కడున్నవాళ్లంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాడు. ఒక్క క్షణం అటు.. ఇటు అయినా అతడి ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. రైల్వే ట్రాకుల వెంట నడవొద్దని, ట్రాకులపై నుంచి దాటొద్దని రైల్వే శాఖ ఎన్ని సార్లు సూచనలు జారీ చేసినా కొందరికి చెవిన పడటం లేదు. దీంతో చాలా మంది రైలు ప్రమాదాల్లో చనిపోతున్నారు. ప్రభుత్వం కూడా కల్పించుకుని మరిన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది.


Next Story