పెళ్లికి వ‌చ్చే అతిథుల కోసం.. విమానాన్ని బుక్ చేశారు

Couple Books An Entire Plane To Travel With Family For Wedding.పెళ్లికి వ‌చ్చే అతిథుల కోసం విమానాన్నే బుక్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Dec 2022 9:47 AM IST
పెళ్లికి వ‌చ్చే అతిథుల కోసం.. విమానాన్ని బుక్ చేశారు

మ‌న దేశంలో పెళ్లిళ్ల‌కు ఉన్న ప్ర‌త్యేక‌తే వేరు. జీవితంలో ఒక్క‌సారే చేసుకునే ఈ వేడుక కోసం ఆహారం నుంచి అలంక‌ర‌ణ వ‌ర‌కు ఎక్క‌డా రాజీప‌డ‌రు. ఎవ‌రి స్థోమ‌త‌కు త‌గ్గ‌ట్లు వారు వివాహా వేడుక‌ల‌ను చేసుకుంటుంటారు. వ‌చ్చే అతిథుల కోసం బ‌స్సు, రైలు సౌక‌ర్యం వంటివి ఏర్పాటు చేయ‌డం చూస్తూనే ఉంటాం. అయితే.. ఓ జంట మాత్రం ఏకంగా విమానాన్నే బుక్ చేసింది. ఆ విమానంలో బంధు వ‌ర్గం ప్ర‌యాణిస్తూ చేసిన సంద‌డికి సంబంధించిన ఓ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

డిజిట‌ల్ క్రియేట‌ర్ శ్రేయా సాహ్ ఈ వీడియోను పోస్ట్ చేశారు. రాజస్థాన్‌లోని జైస‌ల్మేర్‌లో జ‌రిగే పెళ్లికి వ‌ధువు, వ‌రుడి త‌రుపు బంధువుల‌ను తీసుకువెళ్లేందుకు విమానాన్ని బుక్ చేశారు. అంద‌రూ విమానంలో కూర్చొని కేరింత‌లు కొడుతూ సంద‌డి చేశారు. వీడియో చివర్లో విమానంలో కూర్చున్న జంట కూడా కనిపించింది, ఇప్ప‌టి వ‌ర‌కు ఈ వీడియోను కోటి మందికి పైగా వీక్షించారు.

కాగా.. దీనిపై నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్నారు. మీరు ధ‌న‌వంతుల‌ని చెప్ప‌క‌నే చెబుతున్నారంటూ ఓ నెటీజ‌న్ కామెంట్ చేయ‌గా.. మాకు అలాంటివి క‌ష్టం అని మ‌రొక‌రు అన్నారు.

Next Story