Video: రసగుల్లా కోసం లొల్లి, ఆగిపోయిన పెళ్లి..వరుడిపై వరకట్నం కేసు

రసగుల్లా కారణంగా కళ్యాణ మండపంలో వివాహం ఆగిపోయిన ఘటన బిహార్‌లోని బుద్ధగయలో నవంబర్ 29న చోటు చేసుకుంది.

By -  Knakam Karthik
Published on : 5 Dec 2025 7:58 AM IST

National News, Bihar, Viral Video, Bodh Gaya

Video: రసగుల్లా కోసం లొల్లి, ఆగిపోయిన పెళ్లి..వరుడిపై వరకట్నం కేసు

రసగుల్లా కారణంగా కళ్యాణ మండపంలో వివాహం ఆగిపోయిన ఘటన బిహార్‌లోని బుద్ధగయలో నవంబర్ 29న చోటు చేసుకుంది. ఒక వివాహంలో రసగుల్లాల కొరత కారణంగా వధూవరుల కుటుంబాలు ఘర్షణ పడ్డాయి. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ జిల్లాలోని హథియావాన్ గ్రామానికి చెందిన మహేంద్ర ప్రసాద్ కుమారుడు పవన్ కుమార్‌‌కు, సమీపంలోని బక్‌రౌర్ గ్రామానికి చెందిన సురేశ్ ప్రసాద్ కుమార్తెతో పెళ్లి కుదిరింది. నవంబరు 29న బక్‌రౌర్ గ్రామంలోని ఓ ఫంక్షన్ హాల్ వేదికగా పెళ్లి వేడుక జరిగింది. వధూవరుల కుటుంబాలు ఈ హోటల్‌కు చేరుకున్నాయి.

మొదట సంప్రదాయబద్ధంగా వధూవరులు వరమాలలను మార్చుకున్నారు. తదుపరి వివాహ ఘట్టాలు ఆరంభం అయ్యాయి. సరిగ్గా ఇదే సమయంలో ఫంక్షన్ హాల్‌లోని భోజనశాలలో గొడవ మొదలైంది. అతిథులకు భోజనాలను వడ్డించే క్యూ లైన్ వద్ద నిలబడిన వారు కుర్చీలతో ఒకరినొకరు కొట్టుకున్నారు. ఆ గదిలోని బెంచ్‌లపై పెట్టి ఉన్న వంటకాలను కింద పారవేశారు. కొందరు పరస్పర ఘర్షణకు దిగారు. ఈక్రమంలో పలువురికి గాయాలు కూడా అయ్యాయి. ఈ దృశ్యాలన్నీ అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.

రసగుల్లాల కొరత కారణంగా గొడవ ప్రారంభమైందని వరుడి తండ్రి మహేంద్ర ప్రసాద్ ధృవీకరించారు. గందరగోళం తర్వాత వధువు కుటుంబం 'తప్పుడు' వరకట్న కేసు పెట్టిందని కూడా ఆయన ధృవీకరించారు. అతని ప్రకారం, తన తరపు వారు పెళ్లిని కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నారు. అయినప్పటికీ, వధువు కుటుంబం దానిని రద్దు చేసింది.

Next Story