వామ్మో ఏడడుగుల పాము.. ఎక్కడ దాక్కుందంటే.?

పాములు ఎప్పుడు.. ఎక్కడ దాక్కుంటాయో తెలియని పరిస్థితి. కొన్ని కొన్ని సార్లు చైర్లలోనూ, షూలలోనూ దాక్కుంటూ ఉంటాయి.

By Medi Samrat  Published on  11 Dec 2023 7:30 PM IST
వామ్మో ఏడడుగుల పాము.. ఎక్కడ దాక్కుందంటే.?

పాములు ఎప్పుడు.. ఎక్కడ దాక్కుంటాయో తెలియని పరిస్థితి. కొన్ని కొన్ని సార్లు చైర్లలోనూ, షూలలోనూ దాక్కుంటూ ఉంటాయి. బైక్ లలో కూడా దాక్కుని ఉన్న వీడియోలు గతంలో వైరల్ అయిన సంగతి తెలిసిందే!! తాజాగా తమిళనాడులోని చెన్నైలో స్కూటర్‌లో విషపూరిత పాము దాక్కుంది. అయితే అది చాలా చిన్న పాము అయితే కాదు.

ఊహించని విధంగా ద్విచక్రవాహనంలో నాగు పాము దాక్కుంది. ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ కావడంతో, మిలియన్ల మంది చూశారు. ఈ ఘటన చెన్నై నగరంలో చర్చనీయాంశమైంది. స్కూటర్ యజమాని పామును గుర్తించి స్నేక్ కాచర్ ను పిలిపించారు. ఎంతో జాగ్రత్తతో పాముకు ఎలాంటి హాని కలిగించకుండా పట్టుకోడానికి స్కూటర్ ముందు భాగాలను జాగ్రత్తగా విడదీశారు. కొద్దిసేపటికి పామును జాగ్రత్తగా బయటకు తీశారు. పామును అడవిలో వదిలేయబోతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పాము దాదాపు ఏడడుగుల పొడవు ఉంది.

Next Story