Fact Check : తన రిక్షాను అధికారులు సీజ్ చేశారంటూ కన్నీరు మున్నీరైన వ్యక్తి.. మన దేశంలో చోటు చేసుకున్నదేనా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 Oct 2020 11:36 AM GMT
Fact Check : తన రిక్షాను అధికారులు సీజ్ చేశారంటూ కన్నీరు మున్నీరైన వ్యక్తి.. మన దేశంలో చోటు చేసుకున్నదేనా..?

అధికారులు రిక్షాను సీజ్ చేశారంటూ ఓ వ్యక్తి ఏడుస్తూ కనిపిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పొట్టకూటి కోసం రిక్షా తొక్కుకుంటూ బ్రతికే ఆ వ్యక్తికి ఉపాధి లేకుండా చేశారు అధికారులు అంటూ పలువురు సామాజిక మాధ్యమాల్లో విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. ఇలాంటి ఘటనలు భారత్ లో చోటు చేసుకుంటూనే ఉంటాయని పలువురు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేశారు.

R1

“The Law of this country is only for poor peoples..! 😭 #bjpsucks Those ministers wakes up wishes and condolences daily. U idiots are not ruling country for these purposes. Show ur presidency to outrage the law that shall provide justice (sic).” అంటూ ట్వీట్లు చేశారు. చట్టాలు కేవలం పేద ప్రజల కోసమేనని.. భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం ఎప్పుడు ఎప్పుడు మేలుకుంటుందో అని విమర్శలు చేస్తూ ఉన్నారు.

పలువురు ప్రముఖుల ట్వీట్ల కింద కూడా ఈ పోస్టును షేర్ చేస్తూ ఉన్నారు.

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.

వీడియోను బాగా గమనించగా వెనుక వైపు ఉన్న షాపులకు సంబంధించిన హోర్డింగుల్లో బంగ్లా భాషలో ఉంది. ఇక ఆ వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తున్న సమయంలో ఉపయోగించిన మైక్రోఫోన్ ను గమనిస్తే దానిపై ‘Jamuna TV’ అని ఉంది. అది బంగ్లాదేశ్ కు చెందిన న్యూస్ ఛానల్.

R2

ఈ సమాచారాన్ని బట్టి న్యూస్ మీటర్ కీవర్డ్ సెర్చ్ నిర్వహించగా.. ఢాకా ట్రిబ్యూన్ లో అక్టోబర్ 8, 2020న ఓ కథనాన్ని ప్రచురించారు. "Rickshaw puller turns entrepreneur with help from Shwapno“ అంటూ ఆర్టికల్ ను పోస్టు చేశారు.

ఆర్టికల్ కథనం ప్రకారం ఆ వీడియోలో ఉన్న వ్యక్తి పేరు ఫజ్లుర్ రెహమాన్.. అతడి రిక్షాను అధికారులు సీజ్ చేశారు. కోవిద్-19 కారణంగా చోటు చేసుకున్న ఘటనల వలన ఉద్యోగం కోల్పోయిన రెహమాన్.. లోన్ తీసుకుని రిక్షా తీసుకున్నాడట. ఈ ఘటన ఢాకాలో చోటుచేసుకుంది.

News18, Times Now, Asianet News Bangla మీడియా సంస్థలు ఈ ఘటన ఢాకాలో చోటు చేసుకుందని కథనాలను వెల్లడించాయి. అక్టోబర్ 5న ఢాకా సౌత్ సిటీ కార్పొరేషన్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా రిక్షాను ఉంచడంతో సీజ్ చేశారు. దీంతో అతడు కన్నీరు పెట్టుకున్నాడు. ఆ వీడియో కొన్ని గంటల్లోనే బంగ్లాదేశ్ లో వైరల్ అయింది.

R3

రిక్షాను అధికారులు సీజ్ చేయడంతో ఏడ్చిన ఘటన భారత్ లో చోటు చేసుకుందంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'. ఈ ఘటన ఢాకాలో చోటు చేసుకుంది.

Claim Review:Fact Check : తన రిక్షాను అధికారులు సీజ్ చేశారంటూ కన్నీరు మున్నీరైన వ్యక్తి.. మన దేశంలో చోటు చేసుకున్నదేనా..?
Claim Reviewed By:Misha Rajani
Claim Fact Check:false
Next Story