ఆగష్టు 22, 2020న గణేష్ చతుర్థి సందర్భంగా పలువురు సామాజిక మాధ్యమాల్లో ఓ వినాయకుడి విగ్రహానికి సంబంధించిన ఫోటోలను పోస్టు చేయడం మొదలుపెట్టారు. ఊరేగిస్తున్న ఓ వినాయక విగ్రహాన్ని 70కేజీల బంగారంతో, 350 కేజీల వెండితో తయారు చేశారని చెప్పుకొచ్చారు. ఆ విగ్రహం విలువ 264 కోట్ల రూపాయలు అంటూ కూడా పలువురు పోస్టులు చేశారు.

@HinduMandirLive అనే ట్విట్టర్ ఖాతాలో కూడా ఓ విగ్రహానికి సంబంధించిన పోస్టు పెట్టారు. గణేషుడి విగ్రహ తయారీకి 70కేజీల బంగారం, 350 కేజీల వెండిని వినియోగించారని అందులో చెప్పుకొచ్చారు.

दर्शन करिये 264 करोड़ की गणेश जी की मूर्ति के जिसमें 70 kg सोना और 350 kg चांदी लगी है

दर्शन करिये 264 करोड़ की गणेश जी की मूर्ति के जिसमें 70 kg सोना और 350 kg चांदी लगी है

Posted by प्रभु मिलन on Saturday, August 22, 2020

ఫేస్ బుక్ లో కూడా పలు పేజీలలో విగ్రహానికి సంబంధించిన సమాచారాన్ని అచ్చం అలాంటి వాదనతో పోస్టు చేశారు.

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న వీడియోలో ఉన్న గణేషుడి విగ్రహానికి.. 70కేజీల బంగారం, 350 కేజీల వెండిని వినియోగించారని చెబుతూ చేస్తున్న ప్రచారానికి ఎటువంటి సంబంధం లేదు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోకు, కీవర్డ్స్ సెర్చ్ కు సరైన రిజల్ట్స్ లభించలేదు. అయితే ముంబై లోని జి.ఎస్.బి. మండల్ లో గతంలో విగ్రహానికి ఆభరణాలుగా 70కేజీల బంగారం, 350 కేజీల వెండిని వినియోగించారన్న వార్త మాత్రం పలు మీడియా సంస్థలు ప్రచురించాయి.

IndiaTV కూడా 2018లో ముంబైలోని ప్రముఖ గణేష్ విగ్రహం గురించి ప్రచురించింది. 70కేజీల బంగారం, 350 కేజీల వెండిని వినియోగించి వినాయకుడి విగ్రహాన్ని డెకరేట్ చేశారు. ఏబీపీ న్యూస్ కూడా 13 సెప్టెంబర్ 2018న వీడియోను పోస్టు చేసింది.

వైరల్ అవుతున్న పోస్టుల్లో ఉన్నది ఆ విగ్రహం కూడా కాదు.

జి.ఎస్.బి. సేవా మండల్.. ముంబై నగరంలో గణేష్ నవరాత్రి సెలెబ్రేషన్స్ లో చాలా ప్రసిద్ధి చెందినది. ప్రతి ఏడాది గణేషుడిని, మండపాన్ని ఎంతో గొప్పగా అలంకరిస్తూ ఉంటారు. ఎన్డీటీవీలో 2018న పబ్లిష్ చేసిన రిపోర్ట్ ప్రకారం 70కేజీల బంగారం, 350 కేజీల వెండిని వినియోగించి అలంకరించారు. గత 64 సంవత్సరాలుగా భక్తులు ఇచ్చిన ఆభరణాలను విగ్రహానికి అలంకరించారు.

2019 నుండి ఈ వార్త వైరల్ అవుతూనే ఉంది. 2019 లో గణేష్ మండపంలో ఉంచిన విగ్రహానికి.. వైరల్ అవుతున్న ఫోటోకు కూడా ఎటువంటి పోలిక లేదు.

A1

కాబట్టి 70కేజీల బంగారం, 350 కేజీల వెండిని వినియోగించిన గణేషుడి విగ్రహం అంటూ వైరల్ అవుతున్న వీడియోకు జి.ఎస్.బి. సేవా మండల్ ఏర్పాటు చేసిన విగ్రహానికి ఎటువంటి పోలిక లేదు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.
antalya escort
anadolu yakası escort maltepe escort escort bayan kartal escort ataşehir escort pendik escort bostancı escort kurtköy escort maltepe escort kartal escort