Fact Check : మొఘల్ గార్డెన్స్ పేరును.. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గార్డెన్ గా మార్చేశారా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 Aug 2020 2:24 PM GMT
Fact Check : మొఘల్ గార్డెన్స్ పేరును.. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గార్డెన్ గా మార్చేశారా..?

రాష్ట్రపతి భవన్ లోని మొఘల్ గార్డెన్స్ పేరును డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గార్డెన్ గా మార్చేశారంటూ పలువురు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ వస్తున్నారు.

జమ్మూ కాశ్మీర్ లోని మొఘల్ గార్డెన్స్ ను ప్రేరణ తీసుకుని.. తాజ్ మహల్ చుట్టూ ఉన్న పూల తోటలను పోలినట్లుగా సర్ ఎడ్విన్ లూటీన్స్ 1917లో ఈ ఢిల్లీలోని మొఘల్ గార్డెన్స్ డిజైన్ ను రూపొందించారు. ఢిల్లీలోని 15 ఎకరాల్లో ఈ తోటలను ఉంచారు. వివిధ రకాల పూలను ఇక్కడ పెంచుతూ ఉంటారు. ఎక్కడా కనిపించనివి.. చాలా అరుదైన జాతులకు చెందినవి ఇక్కడ చూసే అవకాశం లభిస్తూ ఉంటుంది.

ఆగష్టు 18, ఉదయం 4:31 సమయంలో అనురాగ్ శ్రీ వాత్సవ అనే ట్విట్టర్ ఖాతాలో నుండి.. “BIG: Wow, The name of the Mughal Garden inside the Rashtrapati Bhavan is changed to Dr. Rajendra Prasad Garden”. ట్వీట్ వెలువడింది.



రాష్ట్రపతి భవనం లోని మొఘల్ గార్డెన్ పేరును రాజేంద్ర ప్రసాద్ గార్డెన్ గా మార్చారు. బిగ్ వావ్.. అంటూ పెట్టిన ట్వీట్ ను 5000 మందికి పైగా లైక్ చేశారు.



స్మితా దేశ్ ముఖ్ అనే ట్విటర్ ఖాతాలో కూడా ఈ వార్తను కాస్త ఎడిట్ చేసి పోస్టు చేశారు. “The best news of the Corona period – the Mughal Garden at Rashtrapati Bhavan has now been renamed Dr. Rajendra Prasad Garden.” అంటూ ట్వీట్ వెలువడింది. 14వేలకు పైగా లైక్స్ వచ్చాయి ఈ ట్వీట్ కు. ఆమె ట్విట్టర్ బయోలో జర్నలిస్ట్ అని రాయడమే కాకుండా కమ్యూనికేషన్స్ ఎక్స్పర్ట్ అంటూ రాసుకుని వచ్చింది.



ఆగష్టు 19న కూడా మరికొందరు ట్విట్టర్ యూజర్లు ఇదే వార్తను తమ ఖాతాలలో పోస్టు చేశారు.

నిజ నిర్ధారణ:

రాష్ట్రపతి భవన్ అధికారిక ఖాతాలో మొఘల్ గార్డెన్ ను డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గార్డెన్ గా మార్చినట్లు ఎటువంటి ప్రకటన లేదు.

హిందూ మహాసభ మొఘల్ గార్డెన్ పేరును మార్చాలంటూ ఎప్పటి నుండో డిమాండ్ చేస్తూ ఉంది. భారత మొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ పేరు మీద రాజేంద్ర ప్రసాద్ ఉద్యాన్ గా మార్చాలని డిమాండ్ చేస్తూ ఉన్నప్పటికీ.. ఇంకా అధికారిక నిర్ణయం అన్నది తీసుకోలేదు.

ఆగష్టు 21న ఇన్ఫర్మేషన్ డిపార్ట్ మెంట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పిఐబి) కూడా కేంద్ర ప్రభుత్వం మొఘల్ గార్డెన్స్ పేరును మార్చలేదని స్పష్టం చేసింది.

ఆగష్టు 21, ఆల్ ఇండియా రేడియో కూడా ఇది ఫేక్ న్యూస్ అంటూ ట్వీట్ చేసింది. మొఘల్ గార్డెన్స్ పేరును మార్చారంటూ వచ్చిన వార్తలో ఎటువంటి నిజం లేదని తెలిపింది. మొఘల్ గార్డెన్స్ పేరును మారుస్తూ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకోలేదు అని తేల్చి చెప్పింది.

సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు. [also-read link="https://telugu.newsmeter.in/raam-is-not-the-most-expensive-currency/"]Fact Check : రాముడి పేరు మీద కరెన్సీ కూడా ఉందా.. ప్రజలు వాడుతున్నారా..?[also-read link=""]

Next Story