Fact Check : కరోనాతో సుద్దాల అశోక్ తేజ కన్నుమూత అంటూ పోస్టులు వైరల్..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 July 2020 10:05 AM GMT
Fact Check : కరోనాతో సుద్దాల అశోక్ తేజ కన్నుమూత అంటూ పోస్టులు వైరల్..?

కరోనా వైరస్ ఎంతో మంది ప్రముఖులకు సోకింది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కుటుంబంలో కూడా కరోనా వైరస్ కలకలం రేగింది. పలువురు భారత చిత్ర పరిశ్రమకు చెందిన వారిని కూడా కరోనా కబళించి వేసింది.

తెలుగు లిరిసిస్ట్ సుద్దాల అశోక్ తేజకు కూడా కరోనా వైరస్ సోకిందంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్ అయ్యాయి. సుద్దాల అశోక్ తేజకు కరోనా వైరస్ సోకిందని.. ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారంటూ పలువురు పోస్టులు పెట్టారు.

As

నిజ నిర్ధారణ:

సుద్దాల అశోక్ తేజ కరోనాతో మరణించారన్నది 'అబద్ధం'

సుద్దాల అశోక్ తేజ ఆరోగ్యంతో ఉన్నారు. ఆయన ఇంట్లో జాగ్రత్తగా ఉంటున్నారు. ఈ రూమర్లకు కారణం ఏమిటి అని తెలియగా.. తెలంగాణ ఫోక్ సింగర్, కవి మొహమ్మద్ నిస్సార్ కరోనా వైరస్ కారణంగా చనిపోయారు. ఆ విషయాన్ని కొందరు తప్పుగా అర్థం చేసుకుని.. సుద్దాల అశోక్ తేజ మరణించారని పోస్టులు పెట్టారు. కావాలనే మరికొందరు తప్పుడు వార్తలను వైరల్ చేయడం మొదలుపెట్టారు.

56 సంవత్సరాల మొహమ్మద్ నిస్సార్ తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగి.. ఆయన మియాపూర్ డిపోలో కంట్రోలర్ గా ఉద్యోగం కూడా నిర్వర్తించారు. ప్రజా నాట్య మండలిలో మెంబర్ అయిన నిస్సార్ కరోనా కారణంగా మరణించారు. నల్గొండ జిల్లా సుద్దల గ్రామానికి చెందిన మొహమ్మద్ నిస్సార్ లాక్ డౌన్ గురించి కరోనా మహమ్మారి గురించి పాట కూడా రాశారు. ఆ పాట బాగా వైరల్ అయింది కూడానూ..! ఆయనకు కరోనా సోకడంతో మరణించారు.

మొహమ్మద్ నిస్సార్ మరణం గురించి v6 వార్తా సంస్థ 'సుద్దల గొంతు మూగబోయింది' అంటూ కథనాన్ని రాసింది. నిస్సార్ సుద్దల గ్రామానికి చెందిన వారు కావడంతో ఆ విధంగా హెడ్ లైన్ రాసి మొహమ్మద్ నిస్సార్ చనిపోయారని కథనాన్ని రాశారు.

ఆ హెడ్ లైన్ ను వేరేగా భావించిన చాలా మంది సుద్దాల అశోక్ తేజ మరణించారని అనుకున్నారు. దీంతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ వచ్చారు.

ఈ వార్తలపై సుద్దాల అశోక్ తేజ స్పందించారు. తాను ఆరోగ్యంగా ఉన్నానని ఓ వీడియో రిలీజ్ చేశారు. తాను ఇంట్లోనే ఉన్నానని.. కొన్ని కొత్త ప్రాజెక్ట్స్ ను స్వీకరించానని, పాటలు కూడా రాస్తున్నానని చెప్పుకొచ్చారు.

https://www.indiaglitz.com/suddala-ashok-teja-refutes-rumours-about-his-health-telugu-news-264768

https://www.sakshi.com/news/movies/lyricist-suddala-ashok-teja-about-rumours-his-health-1300109

మొహమ్మద్ నిస్సార్ చనిపోయినట్లు వచ్చిన వార్తా కథనాలు

https://telanganatoday.com/noted-folk-artiste-balladeer-nissar-passes-away-due-to-covid-19

https://www.thenewsminute.com/article/telangana-folk-singer-and-activist-mohammed-nissar-dies-hyderabad-128230

సుద్దాల అశోక్ తేజ మరణించారంటూ వచ్చిన కథనాలు అబద్ధం.

Next Story