Fact Check : 350 రూపాయల నోట్లు మార్కెట్ లోకి వచ్చాయా..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 6 Aug 2020 2:15 PM ISTనోట్ల రద్దు తర్వాత పలు నోట్లు మార్కెట్ లోకి వచ్చాయి. కొత్త తరహా నోట్లు భారత్ లో మనుగడ లోకి వచ్చాయి. కొన్ని కొన్ని సార్లు వివిధ రకాల నోట్లు అందుబాటు లోకి వచ్చాయంటూ రకరకాల ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వాటిని ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చింది ప్రభుత్వం. తాజాగా ఇంటర్నెట్ లో మరో నోటుకు సంబంధించిన ప్రచారం మొదలైంది.
350 రూపాయల నోటు మార్కెట్ లోకి వచ్చిందని వాట్సప్ లో ఫోటో ఒకటి వైరల్ అవుతోందని 'న్యూస్ మీటర్' దానిపై నిజానిజాలు తెలుసుకోవాలంటూ రిక్వెస్ట్ వచ్చింది.
నిజ నిర్ధారణ:
350 రూపాయల నోటు సర్క్యులేషన్ లో వచ్చిందన్నది 'పచ్చి అబద్ధం'.
350 రూపాయలు మనుగడ లోకి వచ్చాయో లేదో తెలుసుకోడానికి RBI వెబ్సైట్ లో చూడగా.. భారత్ లో 350 రూపాయల నోటు మనుగడలో లేదని స్పష్టమైంది. భారత్ లో మనుగడలో ఉన్న నోట్లు 2000, 500, 200, 100, 50, 20, 10 రూపాయల నోట్లు మాత్రమేనని స్పష్టమైంది. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా కూడా 350 రూపాయలను ప్రవేశపెట్టబోతున్నట్లు ఎక్కడ కూడా చెప్పలేదు.
వాట్సప్ లో వచ్చిన ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. 2017 నుండి ఈ నోట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి. ఫోటోలో ఉన్న 350 రూపాయలను ఫోటోషాప్ చేసినట్లు స్పష్టంగా అర్థం అవుతోంది. 200 రూపాయల నోటును ఫోటో షాప్ చేశారు. నోటు మీద ఉన్న 200 సంఖ్యను తీసేసి 350 అనే సంఖ్యను ఉంచారు.
Smhoaxslayer 2017 లో ఇది తప్పుడు వార్త అని చెప్పగా.. News Mobile, Factly 2019లో The Logical Indian జులై 2020న తప్పుడు వార్త అని స్పష్టం చేశాయి.
వాట్సప్ లో వైరల్ అవుతున్న 350 రూపాయల నోటు విషయంలో ఎటువంటి నిజం లేదు. ఈ ఫేక్ ఫోటో 2017 నుండి వైరల్ అవుతూనే ఉంది.