Fact Check : రామ మందిరం డిజైన్ ఇదేనంటూ ఫోటో వైరల్..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 24 July 2020 12:26 PM GMTఅయోధ్య లోని రామ మందిరం పూర్తీ అయితే ఇలాగే ఉంటుందంటూ ఓ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీని గురించి నిజా నిజాలు తెలియజేయాలంటూ పలువురు కోరుతూ ఉన్నారు.
ఈ ఫోటో 2015 నుండి సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేషన్ లో ఉందని న్యూస్ మీటర్ గుర్తించింది.
రామ మందిరం నిర్మాణం ఇలాగే ఉంటుందంటూ యూట్యూబ్ లో పోస్టు చేశారు.
నిజ నిర్ధారణ:
రామ మందిరం నిర్మాణం ఇదేనంటూ వైరల్ అవుతున్న పోస్టు 'పచ్చి అబద్ధం'
ఈ ఫోటోను గూగుల్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. వెస్ట్ బెంగాల్ లోని మాయాపూర్ ఇస్కాన్ టెంపుల్ కి సంబంధించిన నిర్మాణం ఇదని తెలుస్తోంది.
అయోధ్య రామ మందిర్ (Ayodhya Ram Mandir) కు సంబంధించిన కీవర్డ్స్ ను ఉపయోగించి చూడగా పలు రిజల్ట్స్ వచ్చాయి. ‘Shree Ram Janmabhoomi Tirth Kshetra’ అన్నది రామ జన్మభూమి ట్రస్ట్ కావడంతో అయోధ్య రామ మందిరం నిర్మాణానికి సంబంధించిన అసలైన డిజైన్ ను రూపొందించింది.
అయోధ్యలోని రామ మందిరంకు చెందిన డిజైన్ ఇలా ఉండనుంది.
అయోధ్య రామ మందిరం నిర్మాణానికి సంబంధించిన వివరాలు కూడా ఉన్నాయి. రామ మందిరం 161 అడుగుల ఎత్తు ఉండనుంది. 1988లో డిజైన్ చేసినప్పుడు 141 అడుగులు గా చెప్పారు. ఆలయ నిర్మాణం ఆగష్టు నెల 5వ తేదీన మొదలుకానుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజకు హాజరయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఇండియా న్యూస్ అయోధ్య రామ మందిరం నిర్మాణానికి సంబంధించిన డిజైన్ పై విడుదల చేసిన వీడియో:
వైరల్ ఫోటో ఉన్నది మాయాపూర్ లోని ఇస్కాన్ ఆలయంకు చెందినది. టెంపుల్ ఆఫ్ వేదిక్ ప్లానటోరియం(టిఓవిపి)కు చెందిన డిజైన్ ఇది. ఇస్కాన్ కు చెందిన శ్రీల ప్రభుపాద ఈ డిజైన్ ను దగ్గర ఉండి రూపొందించారు. శ్రీమద్ భాగవతం ఆధారంగా లోపల అద్భుతమైన కట్టడాలను, విశ్వాన్ని రూపొందించనున్నారు. అమెరికా లోని వాషింగ్టన్ లో ఉన్న 'ది కేపిటల్ బిల్డింగ్' ను పోలి ఉండాలని భావించారు.
అందుకు సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ చూడొచ్చు:
ఈ కట్టడాన్ని 2022 లో గురుపూర్ణిమ లోపు పూర్తీ చేసి.. ఘనంగా ప్రారంభించాలని భావిస్తున్నారు. కట్టడం లోపలి పనోరమిక్ వ్యూ ను ఈ లింక్ లో చూడొచ్చు. https://www.tovp360.org/
గంగానదీ తీరంలో నిర్మిస్తున్న ఈ కట్టడాన్ని 2022లో గురుపూర్ణిమ లోపు పూర్తీ చేసి.. అదే రోజు భక్తులకు కూడా ఆహ్వానం పలకాలని ఇస్కాన్ భావిస్తోంది. ప్రపంచంలోనే ఎత్తైన దేవాలయంగా చరిత్ర లిఖించనున్నారు.
Times of India, Telangana Today లో వేదిక్ ప్లానిటోరియంకు సంబంధించిన వార్తలను చూడొచ్చు.
ఈ వైరల్ ఫోటో రామ జన్మభూమికి చెందినది కాదని Aajtak, Boomlive సంస్థలు గతంలోనే తెలిపాయి.
వైరల్ అవుతున్న ఫోటోలో ఉన్న డిజైన్ అయోధ్యలో నిర్మించ తలపెట్టిన రామ జన్మ భూమికి సంబంధించినది కాదు. ఇది ఇస్కాన్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని మాయపూర్ లో నిర్మిస్తూ ఉన్న వేదిక్ ప్లానెటోరియం. వైరల్ అవుతున్న ఫోటోలో ఎటువంటి నిజం లేదు.