Fact Check : రైల్వేలో 5285 అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలంటూ వచ్చిన ప్రకటనలో నిజమెంత..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  14 Aug 2020 4:31 PM IST
Fact Check : రైల్వేలో 5285 అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలంటూ వచ్చిన ప్రకటనలో నిజమెంత..?

ఉద్యోగాల పేరుతో జరిగే మోసాలు ఎన్నో..! లాక్ డౌన్ కారణంగా ఎంతో మంది ఉద్యోగాలను కూడా కోల్పోయారు. ఇలాంటి సమయంలో తప్పుడు పేపర్ ప్రకటనలు ఎంతో మందిని ఆకర్షిస్తూ ఉంటాయి. తాజాగా అలాంటి ప్రకటన ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది.

‘Avestran Infotech’ కంపెనీ రైల్వేలో ఔట్ సోర్సింగ్ జాబులు ఇప్పిస్తున్నట్లు పేపర్ ప్రకటన ఒకటి వైరల్ అవుతోంది. మొత్తం 5285 ఉద్యోగాలు.. 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని తెలిపారు. అప్లికేషన్స్ కోసం లింక్ ను కూడా ఇచ్చారు. అప్లికేషన్స్ లాస్ట్ డేట్ సెప్టెంబర్ 10, 2020 అని తెలిపారు. మొత్తం ఎనిమిది కేటగిరీలలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఉన్నాయని చెప్పారు.

1

నిజ నిర్ధారణ:

‘Avestran Infotech’ కంపెనీ ఇండియన్ రైల్వేస్ లో ఉద్యోగాలు ఇప్పిస్తున్నట్లు వచ్చిన వార్తల్లో 'ఎటువంటి నిజం లేదు'

‘www.avestran.in’ అనే వెబ్సైట్ లింక్ కూడా ఉంది. ఇప్పుడు ఆ వెబ్సైట్ లింక్ పని చేయడం లేదు. 'Avestran Infotech’ వెబ్ సైట్ కూడా అందుబాటులో లేదు.

2

మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కూడా ఈ జాబ్ ఆఫర్స్ లో ఎటువంటి నిజం లేదని తేల్చేసింది. ఉద్యోగాల విషయంలో ‘Avestran Infotech’ సంస్థ ప్రకటనకు ఎటువంటి సంబంధం లేదని తేల్చేశారు. ఇలాంటి ఫేక్ వార్తలను నమ్మకండని.. రైల్వేలో ఉద్యోగాల భర్తీ 'భారత రైల్వే' ద్వారానే చేస్తామని అన్నారు.

భారత రైల్వేలో ఉద్యోగాల ప్రకటన ఇండియన్ రైల్వేస్ మాత్రమే చేస్తుంది. ఏ ప్రైవేట్ ఏజెన్సీకి కూడా ఉద్యోగాలను ఇచ్చే హక్కు కానీ అధికారాలు కానీ లేవు. అలా ఎవరైనా ప్రకటనలు చేయడం చట్ట వ్యతిరేకం. సెంట్రలైజ్డ్ ఎంప్లాయిమెంట్ నోటిఫికేషన్స్ (CENs) ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపింది ఇండియన్ రైల్వే.

“Clarification about an advertisement by a private agency in a newspaper regarding alleged recruitment in eight categories of posts on Indian Railways,” అంటూ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కూడా ప్రైవేట్ కంపెనీ ఇచ్చిన ప్రకటన ఫేక్ అంటూ ధృవీకరించి ట్వీట్ చేసింది.

ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కూడా ఈ వార్త ఫేక్ అని చెప్పింది. ‘Avestran Infotech’ కంపెనీ ఇండియన్ రైల్వేస్ లో ఉద్యోగాలు ఇప్పిస్తున్నట్లు వచ్చిన ప్రకటనలో ఎటువంటి నిజం లేదని తెలిపింది.



ఈ ప్రకటన ఇచ్చిన ఏజెన్సీ మీద భారతీయ రైల్వేస్ విచారణకు ఆదేశించింది. బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని అన్నారు.

భారతీయ రైల్వే లో 5200 పైగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలపై వచ్చిన ప్రకటనలో ఎటువంటి నిజం లేదు.

Next Story