గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబే పోస్టు మార్టంలో ఏముందంటే..!

By సుభాష్  Published on  20 July 2020 2:19 PM IST
గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబే పోస్టు మార్టంలో ఏముందంటే..!

ఉత్తరప్రదేశ్‌లో గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌దూబే ఎన్‌కౌంటర్‌ సంచలన సృష్టించిన విషయం తెలిసిందే. ఎనిమిది మంది పోలీసులను కాల్చి చంపిన ఘటనలో ప్రధాన నిందితుడైన గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబే బుల్లెట్‌ గాయాలతో తీవ్ర రక్తస్రావం కావడంతో షాక్‌కు గురై మరణించినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. కాగా, జూలై 10న ఉజ్జయిని నుంచి వికాస్‌దూబేను కాన్పూర్‌కు తీసుకెళ్తుండగా, మార్గమధ్యలో వాహనం బోల్తా పడింది. దీంతో తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నిస్తూ, పోలీసుల నుంచి తుపాకీ లాక్కుని కాల్పులు జరిపేందుకు ప్రయత్నించగా, పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో వికాస్‌దూబే మృతి చెందాడు.

అయితే ఉత్తరప్రదేశ్‌ స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసుల సాయంతో సీనియర్‌ ఫోరెన్సిక్‌ పైన్స్‌ ల్యాబ్‌ నిపుణులు ఇక్కడ తిరిగి సీన్‌ క్రియేట్‌ చేశారు. ఆ రోజు అక్కడే ఉన్న పోలీసులు, ఇతర సిబ్బంది కూడా హాజరయ్యారు. తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు ఫోరెన్సిక్‌ నిపుణులు వెల్లడించారు.

పోస్ట్‌ మార్టం నివేదిక ప్రకారం.. మూడు బుల్లెట్లు వికాస్‌ దూబే శరీరంలోకి దూసుకెళ్లాయి. అలాగే వికాస్‌ శరీరంపైపది గాయాలు కూడా ఉన్నాయి. మొదటి బుల్లెట్‌ దూబే కుడి భుజానికి, ఇంకా రెండు బుల్లెట్లు ఛాతి ఎడమవైపు చొచ్చుకువెళ్లాయని నివేదిక వెల్లడించింది. గ్యాంగ్‌స్టర్‌ దూబే తల, మోచేయి, కడుపు భాగంలోనూ గాయాలున్నట్లు నివేదిక పేర్కొంది.

Next Story