బ్రేకింగ్: మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే అరెస్ట్
By సుభాష్ Published on 9 July 2020 10:15 AM ISTఉత్తరప్రదేశ్‌లో 8 మంది పోలీసులను కాల్చి చంపి వారం రోజుల నుంచి ముప్పు తిప్పలు పెడుతున్న మోస్ట్‌వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే అరెస్ట్ అయ్యాడు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీలో పోలీసులు అరెస్ట్ చేశారు. గత శుక్రవారం కాన్పూర్‌లో 8 మంది పోలీసులను హతమార్చిన కేసులు దూబే ప్రధాన నిందితుడు. ఇప్పటి నుంచి పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుని తిరుగుతున్న దూబేని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, వికాస్ దూబే అనుచరుల్లో ముగ్గురిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు.
బుధవారం ఒకరు, గురువారం ఇద్దరు అనుచరులను పోలీసులు కాల్చి చంపారు. దూబేపై ఇప్పటి వరకు 60 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అయితే యూపీలోని ఉజ్జయిని ఆలయానికి వెళ్లిన దూబే..నేనే వికాస్ అంటూ ఆలయం వద్ద బిగ్గరగా అరిచాడు. దీంతో ఆలయ భద్రతా సిబ్బంది దూబేను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
Next Story